Movies in Theaters This Week: శుక్ర‌వారం ఎనిమిది సినిమాలు రిలీజ్ - ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల‌దే హ‌వా-sapta sagaragalu dhaati to 7 g brindavan colony list of telugu movies releasing this week in theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Movies In Theaters This Week: శుక్ర‌వారం ఎనిమిది సినిమాలు రిలీజ్ - ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల‌దే హ‌వా

Movies in Theaters This Week: శుక్ర‌వారం ఎనిమిది సినిమాలు రిలీజ్ - ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల‌దే హ‌వా

HT Telugu Desk HT Telugu
Sep 19, 2023 02:06 PM IST

Movies in Theaters This Week: ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు ఎనిమిది సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

స‌ప్త‌సాగ‌రాలు దాటి
స‌ప్త‌సాగ‌రాలు దాటి

స‌ప్త‌సాగ‌రాలు దాటి

ర‌క్షిత్‌శెట్టి, రుక్మిణివ‌సంత్ హీరోహీరోయిన్లుగా న‌టించిన‌ క‌న్న‌డ మూవీ స‌ప్త సాగ‌ర దాచేఎల్లో డీసెంట్ హిట్‌గా నిలిచింది. రొమాంటిక్ మ్యూజిక‌ల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా స‌ప్త‌సాగ‌రాలు దాటి పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 22న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు హేమంత్ జి రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌ప్త సాగ‌రాలు దాటి సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్ట‌రీ తెలుగులో రిలీజ్ చేస్తోంది.

తంతిరం

ప్రియాంక‌శ‌ర్మ‌, శ్రీకాంత్ గుర్రం జంట‌గా న‌టించిన తంతిరం మూవీ ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ హార‌ర్ మూవీకి ముత్యాల మెహ‌ర్ దీప‌క్ ద‌ర్శ‌కుడు. అలాగే చిగురుపాటి సుబ్ర‌హ్మ‌ణ్యం డైరెక్ష‌న్‌లో రూపొందిన నెల్లూరి నెర‌జాన మూవీ కూడా సెప్టెంబ‌ర్ 22న విడుద‌లవుతోంది. ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో చంద్ర‌, అక్సాఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. సూర్య‌, విషిక జంట‌గా న‌టించిన అష్ట‌దిగ్భంద‌నం మూవీ ఈ ఫ్రైడే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

నేనే స‌రోజ‌....

కౌశిక్‌బాబు, శాన్వీమేఘ‌న నాయ‌కానాయిక‌లుగా న‌టించిన నేనే స‌రోజ‌తో పాటు చీట‌ర్ అనే చిన్న సినిమా కూడా ఈ వారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. క‌న్న‌డ డ‌బ్బింగ్ మూవీ క‌లివీరుడు సెప్టెంబ‌ర్ 22న విడుదలవుతోంది.

7/జీ బృందావ‌న‌కాల‌నీ…

ఈ చిన్న సినిమాల‌తో పాటు ర‌వికృష్ణ‌, సోనియా అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన 7/జీ బృందావ‌న‌కాల‌నీ మూవీ సెప్టెంబ‌ర్ 22న రీ రిలీజ్ కానుంది. ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీకి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Whats_app_banner