Samyuktha Menon: త్రివిక్రమ్ సినిమా రూమర్లపై సంయుక్త స్పష్టత
త్రివిక్రమ్-మహేశ్ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో రెండో హీరోయిన్‌గా సంయుక్తా మీనన్ నటిస్తుందనే రూమర్లపై సదరు నటి క్లారిటీ ఇచ్చింది. ఆ సినిమాలో తాను భాగం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం బింబిసార ప్రమోషన్లలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో తన మొదటి సినిమాతోనే పవన్ కల్యాణ్‌తో నటించి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది సంయుక్తా మీనన్. భీమ్లా నాయక్ చిత్రంలో రానా సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం అదే ప్రొడక్షన్ కంపెనీలో మరోసారి సినిమా చేస్తోంది. అదే 'సార్'. ఈ సినిమాలో ధనుష్ హీరో. ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో త్రివిక్రమ్ సంయుక్త మీనన్‌కు మద్దతిస్తున్నారంటూ రూమర్లు వస్తున్నాయి. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న చిత్రంలోనూ సంయుక్తానే రెండో హీరోయిన్ అనే వార్తలు ఈ రూమర్లు ఇంకా బలం చేకూరుస్తున్నాయి. తాజాగా వీటన్నింటికీ చెక్ పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
"మొదట్లో ఈ రూమర్లను చూసి నాకు బాధేసింది. ధనుష్‌తో సార్ అనే చిత్రం మొదలైన మూడు రోజులకే నేను ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మీరనుకున్నట్లు కాకుండా సినిమాను పూర్తి చేశాను. మళ్లీ రూమర్లను నాపై వస్తున్నాయి. మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో నేను భాగం కాదు. ఈ రూమర్లను నమ్మేవాళ్లు లేకపోలేదు. అందుకే నేను వారి గురించి పెద్దగా బాధపడను" అని సంయుక్తా మీనన్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం సంయుక్తా తను నటించిన బింబిసార ప్రమోషన్లలో బిజీగా ఉంది. కల్యాణ్ రామ్ సరసన్ చేసిన ఈ చిత్రంలో తన పాత్ర గురించి తెలిపింది. "బింబిసార టైమ్ ట్రావెల్ ఫాంటసీ సినిమా. రెండు వేరు వేరు కాలల మధ్య నడిచే కథ. నా పాత్ర వర్తమాన కాలానికి సంబంధించిందిగా ఉంటుంది. మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తా. బింబిసార-2లో పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది" అని ఆమె స్పష్టం చేసింది.
ప్రస్తుతం ధనుష్ సార్ చిత్రంలో నటిస్తోంది సంయుక్త. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓ పాట మినహా పూర్తయింది. దీంతో పాటు తెలుగులో సాయితేజ్ పక్కన ఓ సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాయితేజ్‌తో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇది కాకుండా మలయాళంలో మరో సినిమా ఒప్పుకుందట సంయుక్త.
సంబంధిత కథనం
టాపిక్