Samantha - Vicky Kaushal Bollywood Movie: నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో స‌మంత బాలీవుడ్ సినిమా-samantha to pair up with bollywood hero vicky kaushal for historical movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Samantha To Pair Up With Bollywood Hero Vicky Kaushal For Historical Movie

Samantha - Vicky Kaushal Bollywood Movie: నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో స‌మంత బాలీవుడ్ సినిమా

Nelki Naresh Kumar HT Telugu
Sep 30, 2022 03:37 PM IST

Samantha - Vicky Kaushal Bollywood Movie: జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తో బాలీవుడ్ సినిమా చేయ‌బోతున్న‌ది స‌మంత‌. చారిత్ర‌క క‌థాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఏదంటే...

స‌మంత‌
స‌మంత‌ (instagram)

Samantha - Vicky Kaushal Bollywood Movie: ఫ్యామిలీ మ్యాన్ 2(Family man 2) సిరీస్ తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది స‌మంత‌. తొలి అడుగులోనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ లో అద్భుత న‌ట‌న‌తో మెప్పించింది. ఈ సిరీస్ త‌ర్వాత స‌మంత‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తిని చూపుతున్నారు. తాజాగా స‌మంత బాలీవుడ్ లో ఓ చారిత్ర‌క సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. విక్కీ కౌశ‌ల్ హీరోగా ఇమ్మోర్ట‌ల్ ఆఫ్ అశ్వ‌థ్థామ పేరుతో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ది. సూప‌ర్ హీరో క‌థాంశంతో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో విక్కీ కౌశ‌ల్‌కు జోడీగా స‌మంత హీరోయిన్ గా నటిస్తోంది.

మ‌హాభార‌త కాలం నాటి క‌థాంశానికి ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడించి ఈ సినిమా రూపుదిద్దుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇందులో స‌మంత పాత్ర డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ మొద‌లుకావాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మైంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ మొద‌లుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

విక్కీ కౌశ‌ల్‌, ఆదిత్య ధ‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న రెండో సినిమా ఇది. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఉరి సినిమా నాలుగు జాతీయ అవార్డుల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఉరి సినిమాకుగాను ఆదిత్య ధ‌ర్ ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా, ఉత్త‌మ న‌టుడిగా విక్కీ కౌశ‌ల్ నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకున్నారు.

కాగా స‌మంత ప్ర‌స్తుతం తెలుగులో య‌శోద, శాకుంత‌లం సినిమాలు చేస్తోంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషి సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు ఫ్యామిలీ మ్యాన్ ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ డీకేల‌తో బాలీవుడ్‌లో యాక్ష‌న్ సీరీస్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది స‌మంత‌.

IPL_Entry_Point