Samantha Instagram Post: ఈ ఫొటోతో సమంత ఏం చెప్పాలనుకుంటోంది? డీకోడ్ చేసేసిన ఫ్యాన్స్
Samantha Instagram Post: సమంత చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఈ ఫొటోతో ఆమె ఏం చెప్పాలనుకుంటోంది? ఈ ప్రశ్నకు ఫ్యాన్స్ సమాధానం ఇచ్చేశారు. నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ కు లింకు పెడుతూ కొందరు చేస్తున్న కామెంట్స్ అది నిజమేనేమో అనిపించేలా చేస్తున్నాయి.
Samantha Instagram Post: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థంపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో అని చాలా మంది ఎదురు చూశారు. కానీ ఆమె నుంచి ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి రియాక్షన్ లేదు. అయితే తాజాగా గురువారం (ఆగస్ట్ 15) ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఆ ఫొటోను డీకోడ్ చేసేశారు.
సమంత ఆ ఫింగర్ చూపించిందా?
సమంత తాజాగా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. కేవలం ఫొటో మాత్రమే పోస్ట్ చేసి.. దానికి ఎలాంటి క్యాప్షన్ లేకుండా వదిలేసింది. ఈ ఫొటోలో సామ్ స్వెట్ షర్ట్ వేసుకొని, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ తో బాల్ లేడీ లుక్ లో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న షర్ట్ పై రాసి ఉన్న అక్షరాలతోపాటు ఆమె తలకు అలా చేయి ఆనించి తన మిడిల్ ఫింగర్ చూపించిందంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సమంత స్వెట్ షర్ట్ పై.. "శాంతి, నిశ్శబ్దానికి మ్యూజియం" అని రాసి ఉంది. అంతేకాదు ఈ పోస్టుకు ఆమె నవ్ వి ఆర్ ఫ్రీ అనే పాటను కూడా జోడించింది. అయితే అందరి కళ్లూ ఆమె వేలివైపే వెళ్లాయి.
ఆ ఫింగర్ ఎంతమంది చూశారు?
సమంత కావాలనే అలా తన మిడిల్ ఫింగర్ కనిపించేలా ఫొటోలకు పోజులిచ్చిందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ పోస్టుకు కామెంట్స్ చేసిన చాలా మంది ఆ ఫింగర్, ఈ సాంగ్ ను ఎంత మంది గుర్తించారు అని అనడం గమనార్హం. వాళ్లు ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే తనకేంటి అన్నట్లుగా సామ్ కావాలనే ఈ పాటను, అలా మిడిల్ ఫింగర్ కనిపించేలా పోజు ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇది కళ్లు అదిరిపోయే రిప్లై.. క్వీన్ బిహేవియర్.. ఆటిట్యూట్ ఓవర్‌లోడెడ్.. దీనికి ఫొటో చాలు క్యాప్షన్ అవసరం లేదు.. ఓ క్వీన్ ఇలాగే రియాక్ట్ అవుతుంది అనే కామెంట్స్ తో సమంత పోస్టు నిండిపోయింది. ఈ ఫొటోకు చాలా మంది సామ్ కు మద్దతుగానే కామెంట్స్ చేశారు.
నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ పై తన రియాక్షన్ ఊహిస్తున్న వారికి ఇది ఆమె ఇచ్చిన అదిరిపోయే రెస్పాన్స్ అని సమంత ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిజానికి సామ్ కూడా ఈ ఫొటోకు ఎలాంటి క్యాప్షన్ పెట్టకుండా ఫ్యాన్స్ ఊహకే వదిలేస్తున్నట్లుగా పోస్ట్ చేసింది. చైతన్య, శోభిత ఆగస్ట్ 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఇంట్లోనే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.