Sai Pallavi Remuneration: అమరన్ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అడ్వాన్స్ బుకింగ్స్‌కు అదిరే రెస్పాన్స్-sai pallavi remuneration amaran movie release date advance bookings telugu dubbing rights details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi Remuneration: అమరన్ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అడ్వాన్స్ బుకింగ్స్‌కు అదిరే రెస్పాన్స్

Sai Pallavi Remuneration: అమరన్ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అడ్వాన్స్ బుకింగ్స్‌కు అదిరే రెస్పాన్స్

Hari Prasad S HT Telugu

Amaran Sai Pallavi Remuneration: సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్, అడ్వాన్స్ బుకింగ్స్, తెలుగు డబ్బింగ్ హక్కులు వంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకోండి.

అమరన్ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అడ్వాన్స్ బుకింగ్స్‌కు అదిరే రెస్పాన్స్

Amaran Sai Pallavi Remuneration: అమరన్.. సాయి పల్లవి నటించిన లేటెస్ట్ మూవీ ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆ పాత్రను శివకార్తికేయన్ పోషిస్తున్నాడు. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు అటు తమిళం, ఇటు తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

అమరన్.. సాయి పల్లవి రెమ్యునరేషన్

ఈ సినిమాలో మేజర్ ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది. డ్యాన్స్ తోపాటు అన్ని ఎమోషన్లను చక్కగా చూపిస్తూ అదిరిపోయేలా నటించే ఆమె.. ఈ మూవీతో మరోసారి ప్రేక్షకుల మనసులు దోచుకోవడానికి సిద్ధమైంది.

అయితే ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. అమరన్ మూవీలో నటించడానికి సాయి పల్లవి ఏకంగా రూ.3 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఫిమేల్ లీడ్ కు ఇది మంచి మొత్తమే అని చెప్పొచ్చు.

అమరన్.. అడ్వాన్స్ బుకింగ్స్

ఇక అమరన్ మూవీపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనూ తమిళ, తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. రిలీజ్ కు మరో మూడు రోజులు ఉండగానే అంటే సోమవారానికి (అక్టోబర్ 28) దేశవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

కేవలం తమిళనాడులోనే రూ.2.7 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడవగా.. దేశవ్యాప్తంగా రూ.2.9 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులోనే 1.56 లక్షల టికెట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరే తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ.6 కోట్ల మార్క్ అందుకునే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

అమరన్.. తెలుగు డబ్బింగ్ హక్కులు

సాయి పల్లవి, శివ కార్తికేయన్ ఇద్దరికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. వీళ్ల డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే బాగానే చూస్తారు. దీంతో అమరన్ మూవీ తెలుగు డబ్బింగ్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఏకంగా రూ.5 కోట్లకు ఈ హక్కులు అమ్ముడుపోవడం విశేషం. ఓ శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ సినిమాకు ఇదే అత్యధిక మొత్తం కావడం విశేషం.

కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించాడు. అమరన్ మూవీ తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజైన మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడమే మేకర్స్ ను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడో రెండేళ్ల కిందట ఆమె ఆర్మీని అవమానించేలా మాట్లాడిందంటూ ఆ వీడియోను వైరల్ చేస్తూ ఈ బాయ్‌కాట్ పిలుపు ఇవ్వడం గమనార్హం.