RRR: హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ లో రన్నరప్‌గా ఆర్ఆర్ఆర్…
ఎన్టీఆర్(ntr),రామ్‌చరణ్ (ram charan)హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ (rrr) అరుదైన ఘనతను దక్కించుకున్నది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కు ఎంపికైన ఈ సినిమా బెస్ట్ పిక్చర్ కేటగిరీలో రన్నరప్ గా నిలిచింది.
రాజమౌళి దర్శకత్వంలో చారిత్ర కథాంశంతో రూపొందిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను మెప్పిస్తోంది. ఈ సినిమా మేకింగ్,టేకింగ్ పై హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్,రామ్‌చరణ్ యాక్టింగ్ అద్భుతమంటూ పొగుడుతున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్(hollywood critics association awards 2022) అవార్డ్స్ ఎంపికై ఈ సినిమా చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఈ సినిమా పోటీపడింది. ఆర్ఆర్ఆర్ కు వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ దృష్ట్యా తప్పకుండా ఉత్తమ సినిమాగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తృటిలో అవార్డును చేజార్చుకున్న ఈ సినిమా బెస్ట్ పిక్చర్ కేటగిరీలో రన్నరప్‌గా నిలిచింది.
ఉత్తమ సినిమాగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా అవార్డును గెలుచుకున్నది. ఈ సినిమాకు చివరి వరకు ఆర్ఆర్ఆర్ గట్టిపోటీనిచ్చింది. ఒకానొకదశలో ఆర్ఆర్ఆర్ బెస్ట్ పిక్చర్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జ్యూరీ మెంబర్స్ ఆర్ఆర్ఆర్ ను కాదని అమెరికన్ సినిమాకు పట్టం కట్టారు. అమెరికన్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో రన్నరప్‌గా నిలిచిన తొలి ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్ జీవితాలకు ఫిక్షనల్ అంశాలను జోడిస్తూ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్,కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. ఈ చారిత్రక చిత్రంతో అలియాభట్ టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ నటించింది. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
సంబంధిత కథనం