RGV vs Garikapati: అనుష్క వీడియోతో గరికపాటిని టార్గెట్ చేసిన రాంగోపాల్‌ వర్మ-rgv vs garikapati as ramgopal varma now shared a video of garikapati talking about anushka shetty ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv Vs Garikapati: అనుష్క వీడియోతో గరికపాటిని టార్గెట్ చేసిన రాంగోపాల్‌ వర్మ

RGV vs Garikapati: అనుష్క వీడియోతో గరికపాటిని టార్గెట్ చేసిన రాంగోపాల్‌ వర్మ

HT Telugu Desk HT Telugu
Oct 12, 2022 09:25 PM IST

RGV vs Garikapati: అనుష్క వీడియోతో గరికపాటిని మరోసారి టార్గెట్ చేశాడు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. చిరంజీవి, గరికపాటి మధ్య మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఆర్జీవీ vs గరికపాటిగా మారిపోయింది.

<p>రాంగోపాల్ వర్మ</p>
రాంగోపాల్ వర్మ (twitter)

RGV vs Garikapati: దసరా తర్వాత ప్రతి ఏటా బీజేపీ నేత దత్తాత్రేయ నిర్వహించే అలయ్‌ బలయ్‌ వేడుకలు ఈసారి ఓ వివాదానికి కేంద్రంగా మారిన విషయం తెలుసు కదా. ఈ వేడుకల్లో అవధాని గరికపాటి నరసింహారావు మాట్లాడుతున్న సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి అక్కడికి రావడం, అతన్ని చూసి సెల్ఫీల కోసం అక్కడున్న వాళ్లంతా ఎగబడటం.. ఇది చూసి గరికపాటి తీవ్ర అసహనానికి గురవడంతో వివాదం రాజుకుంది.

ఆ స్టేజ్‌పైనే చిరంజీవి క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ మరుసటి రోజు గరికపాటిని టార్గెట్‌ చేస్తూ నాగబాబు చేసిన ట్వీట్‌తో మళ్లీ మొదలైంది. అది కూడా సద్దుమణిగిందనుకున్న సమయంలో డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగాడు. వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. గరికపాటిని గడ్డిపరకతో పోలుస్తూ నాగబాబుకు మద్దతుగా ట్వీట్లు చేశాడు.

అదీ చాలదన్నట్లు బుధవారం (అక్టోబర్‌ 12) ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్‌ మరింత దుమారం రేపేలా ఉంది. ఈ ట్వీట్‌లో అతడు గరికపాటికి చెందిన ఓ పాత వీడియోను పోస్ట్‌ చేశాడు. అందులో ఆ అవధాని టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి గురించి మాట్లాడారు. ఆమెను చూసి తానే ఆకర్షితుడిని అయ్యానని, తన కొడుకు అవడంలో ఆశ్చర్యమేమీ లేదని గరికపాటి అన్నారు.

ఆ వీడియోను ఆర్జీవీ షేర్‌ చేస్తూ.. "ఓహో.. ఆహా.. అడ్డెడ్డే" అంటూ వ్యంగ్యంగా ఓ క్యాప్షన్‌ పెట్టాడు. ఇప్పుడు ఆర్జీవీ చేసిన ట్వీట్‌, ఆ వీడియో వైరల్‌గా మారిపోయాయి. ఈ పోస్ట్‌తో రాంగోపాల్‌ వర్మ ఈ వివాదానికి మరో మలుపు ఇచ్చాడు. అసలు చిరంజీవి, గరికపాటి వివాదం కాస్తా ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్లిపోతోంది. ఆ పాత వీడియోలో గరికపాటి.. అనుష్క గురించి ఓ ప్రవచనం సందర్భంగా చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

తాను ఓ మ్యాగజైన్‌పై అనుష్క ఫొటోను చూసినట్లు అందులో ఆయన చెప్పారు. తాను సాధారణంగా రాజకీయ వార్తలు చూస్తుంటానని, అయితే ఒక రోజు తన కాళ్ల దగ్గర కూర్చొన్న తన కొడుకు అనుష్క ఫొటో చూస్తుండగా తన కంటి పడినట్లు గరికపాటి తెలిపారు. తాను కూడా ఆమెను కింది నుంచి మీది వరకూ చూసి ఆకర్షితుడిని అయ్యానని, తన పరిస్థితే ఇలా ఉంటే తన కొడుకు ఆకర్షితమవడంలో తప్పేమీ లేదని అనడం గమనార్హం.

Whats_app_banner