Rashmika and Vijay Dating: విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై రష్మిక పాజిటివ్ రియాక్షన్.. ఏం చెప్పిందో తెలుసా?-rashmika mandanna clarifies on dating rumours with vijay deverakonda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika And Vijay Dating: విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై రష్మిక పాజిటివ్ రియాక్షన్.. ఏం చెప్పిందో తెలుసా?

Rashmika and Vijay Dating: విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై రష్మిక పాజిటివ్ రియాక్షన్.. ఏం చెప్పిందో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Sep 30, 2022 06:13 PM IST

Rashmika about Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై రష్మికా మందన్నా స్పందించింది. ఈ ఊహాగానాలు చాలా క్యూట్‌గా ఉన్నాయని స్పష్టం చేసింది. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు.

<p>విజయ్ దేవరకొండ- రష్మికా మందన్నా</p>
విజయ్ దేవరకొండ- రష్మికా మందన్నా

Rashmika and Vijay dating Rumours: చిత్రసీమలో ఎవరైనా ఇద్దరు హీరో, హీరోయిన్లు కలిసి రెండు, మూడు సినిమాల్లో నటించారంటే చాలు.. వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు పుట్టుకొస్తాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, కలిసి రెస్టారెంట్లకు, వెకేషన్లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని పలు ఊహాగానాలు వ్యాప్తి చెందుతుంటాయి. మన టాలీవుడ్‌లో అయితే విజయ్ దేవరకొండ-రష్మికా మందన్నా ప్రేమలో ఉన్నారని వార్తలు విపరీతంగా వచ్చాయి. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమేనని ఈ ఊహాగానాలను కొట్టిపడేసినప్పటికీ.. వీటికి మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా మరోసారి రష్మికా మందన్నాకు ఇలాంటి చిక్కు ప్రశ్నే ఎదురైంది. అయితే తాను పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడమే కాకుండా.. చాలా తెలివిగా స్పందించింది.

yearly horoscope entry point

విజయ్ దేవరకొండతో డేటింగ్‌లో ఉన్నారని వస్తున్న వార్తలపై మీ స్పందన ఏంటని విలేకరు రష్మికను ప్రశ్నించగా.. ఈ రూమర్లన్నీ చాల్ క్యూట్‌గా ఉన్నాయంటూ స్పష్టం చేసింది. "చూడండి.. విజయ్, నేను కలిసి మా కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలు చేశాం. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన మాకు ఇక్కడ గురించి మాకు పెద్దగా తెలియదు. కానీ అకస్మాత్తుగా ఇలాంటి వార్తలు రావడం కొత్తగా అనిపించింది. అయితే మేము అప్పటికే స్నేహితులయ్యాం. హైదరాబాద్‍‌లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు.. విజయ్‌కు కొంతమంది స్నేహితుల గ్యాంగ్ ఉంది. ఇద్దరికీ ఉమ్మడి స్నేహితులున్నారు. అలా మా స్నేహం కొనసాగుతుంది. ఇదంతా చూస్తుంటే చాలా క్యూట్‌గా ఉందనిపిస్తోంది. అందుకే రష్మిక, విజయ్ క్యూట్ అని అంటున్నా" అని ఈ కన్నడ హీరోయిన్ తెలిపింది.

విజయ్‌తో మరోసారి కలిసి నటిస్తారా? అనే ప్రశ్నకు.. తప్పకుండా అని బదులిచ్చింది రష్మిక. "అతడితో(విజయ్) నేను అతి త్వరలోనే పనిచేయబోతున్నాను. మా ఇద్దరికీ సరిపోయే స్టోరీ వచ్చిందంటే.. మేము తప్పకుండా సినిమా చేస్తాం. ఇదంతా చాలా సరదాగా ఉంటుంది. మేమిద్దరం చాలా మంచి నటులం. మిమ్మల్ని అస్సలు నిరుత్సాహపరచం." అని రష్మికా మందన్నా స్పష్టం చేసింది.

విజయ్ దేవరకొండ ఇటీవలే లైగర్ సినిమాలో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరోపక్క రష్మికా కూడా అమితాబ్ బచ్చన్‌తో కలిసిన చేసిన గుడ్ బై చిత్రం అక్టోబరు 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో నీనా గుప్తా, సునీల్ గ్రోవర్ తదితరులు ముఖ్యభూమికలు పోషించారు.

Whats_app_banner

సంబంధిత కథనం