Ram Charan on Oscars: నా పుట్టబోయే బిడ్డ తెచ్చిపెట్టిన అదృష్టమిది.. ఇండియన్ సినిమా విజయం: రామ్ చరణ్-ram charan on oscars says we have won as indian cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan On Oscars: నా పుట్టబోయే బిడ్డ తెచ్చిపెట్టిన అదృష్టమిది.. ఇండియన్ సినిమా విజయం: రామ్ చరణ్

Ram Charan on Oscars: నా పుట్టబోయే బిడ్డ తెచ్చిపెట్టిన అదృష్టమిది.. ఇండియన్ సినిమా విజయం: రామ్ చరణ్

Hari Prasad S HT Telugu
Mar 13, 2023 01:45 PM IST

Ram Charan on Oscars: నా పుట్టబోయే బిడ్డ తెచ్చిపెట్టిన అదృష్టమిది.. ఇండియన్ సినిమాగా గెలిచాం అంటూ నాటు నాటు ఆస్కార్ విజయంపై రామ్ చరణ్ స్పందించాడు. మొదట రెడ్ కార్పెట్ పై, ఆస్కార్ గెలిచిన తర్వాత చెర్రీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భార్య ఉపాసనతో రామ్ చరణ్
భార్య ఉపాసనతో రామ్ చరణ్ (Jordan Strauss/Invision/AP)

Ram Charan on Oscars: తన పుట్టబోయే బిడ్డ తీసుకొచ్చిన అదృష్టం అంటూ తెగ మురిసిపోయాడు రామ్ చరణ్. ఆస్కార్స్ వేడుకకు ముందు రెడ్ కార్పెట్ పై భార్య ఉపాసనతో కలిసి మాట్లాడిన చరణ్.. ఆర్ఆర్ఆర్ విశ్వవేదికలపై ఈ స్థాయిలో పేరు సంపాదించడంపై ఇలా స్పందించాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ గెలిచి తెలుగు వాళ్లు, భారతీయులంతా గర్వపడేలా చేసిన విషయం తెలిసిందే.

రెడ్ కార్పెట్ పై భర్తతో కలిసి నడిచిన ఉపాసన మాట్లాడుతూ.. తాను ఇక్కడికి రామ్ ను సపోర్ట్ చేయడానికి వచ్చానని, ఆర్ఆర్ఆర్ కుటుంబంలో ఒకరిగా వచ్చినట్లు చెప్పింది. ఆమె మాట్లాడుతుండగానే మధ్యలో జోక్యం చేసుకున్న చరణ్ స్పందిస్తూ.. "ఆమె ఆరు నెలల గర్భవతి. మాకు పుట్టబోయే బిడ్డ మాకు చాలా అదృష్టాన్ని తెచ్చి పెడుతోంది. గోల్డెన్ గ్లోబ్స్ తోపాటు ఇప్పుడు ఇక్కడ ఆస్కార్స్ లో మీ ముందు నిల్చోవడానికి కారణం అదే" అని అనడం విశేషం.

ఇక నాటు నాటు ఆస్కార్స్ గెలిచిన తర్వాత ట్విటర్ ద్వారా మరోసారి స్పందించాడు రామ్ చరణ్. తమ జీవితాల్లో, ఇండియన్ సినిమాలో ఆర్ఆర్ఆర్ ఓ స్పెషల్ మూవీ అని అన్నాడు. ఇప్పటికీ ఇదో కలలాగా ఉందని చెప్పాడు. ఈ అవార్డుల సెర్మనీకి చెర్రీ మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో వచ్చాడు. అతని భార్య ఉపాసన చీరకట్టులో కనిపించింది.

"ఇండియన్ సినిమా చరిత్రలో, మా జీవితాల్లో ఆర్ఆర్ఆర్ ఎప్పటికే ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. ఆస్కార్స్ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇప్పటికీ కలలాగే ఉంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి, కీరవాణి రెండు విలువైన వజ్రాలలాంటి వాళ్లు. ఈ మాస్టర్ పీస్ లో నన్ను భాగం చేసిన వాళ్లిద్దరికీ థ్యాంక్యూ" అని చరణ్ అన్నాడు.

ఆస్కార్స్ వేడుక సందర్భంగా నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పాటకు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ పాటను బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆస్కార్స్ లో ఈ పాట విజయం మొత్తం ఇండియన్ సినిమా విజయంగా కూడా ఈ సందర్భంగా చరణ్ అభివర్ణించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం