Ram Charan Favourite Movies: రామ్ చరణ్‌కు బాగా నచ్చిన తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే.. మీరు ఎన్ని చూశారు?-ram charan favourite movies in telugu and english ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Favourite Movies: రామ్ చరణ్‌కు బాగా నచ్చిన తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే.. మీరు ఎన్ని చూశారు?

Ram Charan Favourite Movies: రామ్ చరణ్‌కు బాగా నచ్చిన తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే.. మీరు ఎన్ని చూశారు?

Hari Prasad S HT Telugu
Mar 02, 2023 05:09 PM IST

Ram Charan Favorite Movies: రామ్ చరణ్‌కు బాగా నచ్చిన తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఏవో తెలుసా? అమెరికాలో ఉన్న చెర్రీ.. ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ సినిమాల గురించి చెప్పుకొచ్చాడు.

రామ్ చరణ్
రామ్ చరణ్ (Getty Images via AFP)

Ram Charan Favorite Movies: రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా టూర్ లో బిజీగా ఉన్న సంగతి తెలుసు కదా. ప్రతిష్టాత్మక ఆస్కార్స్ లో పాల్గొనేందుకు అతడు అక్కడికి వెళ్లాడు. ఈ అవార్డుల రేసులో ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటు కూడా ఉంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలోనూ చెర్రీ బిజీగా ఉంటున్నాడు. అక్కడి ఛానెల్స్ కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ తెలుగు, ఇంగ్లిష్ మూవీస్ గురించి కూడా చరణ్ చెప్పుకొచ్చాడు. అతని ఫేవరెట్ సినిమాల్లో తాను నటించిన రంగస్థలం కూడా ఒకటి కావడం విశేషం. ఈ సినిమాలో చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ రివేంజ్ స్టోరీలో చెర్రీ చెవుడు ఉన్న వ్యక్తిగా తన నటనతో అదరగొట్టాడు.

ఇక చరణ్ ఫేవరెట్ సినిమాల్లో రంగస్థలంతోపాటు రాజమౌళి మూవీ బాహుబలి, ఆల్ టైమ్ సూపర్ హిట్ దాన వీర శూర కర్ణ, బాలీవుడ్ మూవీ మిస్టర్ ఇండియా కూడా ఉన్నాయి. అటు ఇంగ్లిష్ లోనూ తన ఫేవరెట్ సినిమాల గురించి పంచుకున్నాడు. "ది నోట్‌బుక్ నా మొదటి ఫేవరెట్. ఆ తర్వాత టెర్మినేటర్ 2. ఈ సినిమాను నేను కనీసం 50 సార్లు చూసి ఉంటాను. అంత బాగా నచ్చిందీ సినిమా. గ్లాడియేటర్, క్వెంటిన్ టారంటినో సినిమాలన్నీ ఇష్టమే. ఇక ది ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ మూవీ కూడా నా ఫేవరెట్స్ లో ఒకటి" అని చరణ్ చెప్పాడు.

ఆస్కార్స్ లో పాల్గొనేందుకు చరణ్ అమెరికా వెళ్లాడు. ఈ అవార్డుల్లో ట్రిపుల్ ఆర్ మూవీలో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. అంతేకాదు ఈ సెర్మనీలో ఈ పాట లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండనుంది. అయితే చరణ్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేస్తారా లేదా అన్నది చూడాలి. అమెరికాలో బుధవారం (మార్చి 1) ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్ అయింది. లాస్ ఏంజిల్స్ లో ఉన్న ప్రపంచలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ చైనీస్ థియేటర్ లోనూ రిలీజ్ కాగా.. అక్కడున్న 1600 టికెట్లు నిమిషాల్లో అమ్ముడైపోయాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం