Ram Charan Diwali Wishes From Japan: దీపావళికి ఇంట్లో లేకపోవడం బాధగా ఉంది కానీ..: రామ్‌చరణ్‌-ram charan diwali wishes from japan says he could not miss the once in a lifetime opportunity ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Diwali Wishes From Japan: దీపావళికి ఇంట్లో లేకపోవడం బాధగా ఉంది కానీ..: రామ్‌చరణ్‌

Ram Charan Diwali Wishes From Japan: దీపావళికి ఇంట్లో లేకపోవడం బాధగా ఉంది కానీ..: రామ్‌చరణ్‌

HT Telugu Desk HT Telugu
Oct 26, 2022 09:27 PM IST

Ram Charan Diwali Wishes From Japan: దీపావళికి ఇంట్లో లేకపోవడం బాధగా ఉంది కానీ.. అంటూ జపాన్‌లోని ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు టాలీవుడ్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్లలో భాగంగా అతడు జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్, కార్తికేయలతో రామ్ చరణ్
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్, కార్తికేయలతో రామ్ చరణ్

Ram Charan Diwali Wishes From Japan: ఈసారి దీపావళి పండగను జపాన్‌లో జరుపుకున్నాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ. తన సూపర్‌ డూపర్‌ హిట్‌ పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని జపాన్‌లో రిలీజ్‌ చేసిన సందర్భంగా ప్రమోషన్ల కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజమౌళి, అతని తనయుడు కార్తికేయలతో కలిసి చెర్రీ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.

వారం రోజులుగా వీళ్లు జపాన్‌లోనే ఉన్నారు. దీపావళి పండగను కూడా అక్కడే జరుపుకున్నారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు వీళ్లు సోషల్‌ మీడియాలో ఫొటోలను పోస్ట్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం (అక్టోబర్‌ 26) కూడా రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ అకౌంట్లలో కొన్ని ఫొటోలు షేర్‌ చేశాడు. అందులో ఒక ఫొటోలో రాజమౌళితో, మరో ఫొటోలో జూనియర్‌ ఎన్టీఆర్‌, కార్తికేయలతో రామ్‌చరణ్‌ కెమెరాలకు పోజులిచ్చాడు.

దీపావళికి ఇంటిని మిస్‌ అవుతున్నా కూడా.. జీవితంలో ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని ఎలా మిస్‌ చేసుకుంటానంటూ చెర్రీ ఈ ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. "దివాలీకి ఇంటిని మిస్‌ అవుతున్నాను. కానీ జపాన్‌ ఆడియెన్స్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి వస్తున్న ప్రేమ జీవితంలో ఒకసారి వచ్చే అవకాశంలాంటిది. దీనిని ఎలా మిస్‌ అవగలను. జపాన్‌ చాలా ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు, సంస్కృతితోపాటు ఇక్కడి వారికి అందరిపై ఉన్న ప్రేమ, గౌరవం సాటిలేనిది" అని చెర్రీ అన్నాడు.

ఇక మరో ట్వీట్‌ పోస్ట్ చేస్తూ.. "ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ఎక్స్‌పీరియన్స్‌ అందించినందుకు రాజమౌళిగారూ లవ్‌ యూ సో మచ్‌. ఇక సోదరుడు తారక్‌తో మరోసారి సమయం గడపడం చాలా ఆనందంగా ఉంది" అని రామ్‌చరణ్‌ అన్నాడు. ఇక దీపావళి రోజు కూడా భార్య ఉపాసనతో కలిసి జపాన్‌లో ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ పండగ శుభాకాంక్షలు చెప్పాడు.

ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ మూవీకి జపాన్‌లో వచ్చిన స్పందన చూసి చెర్రీ భావోద్వేగానికి గురయ్యాడు. అక్కడి అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. "భావోద్వేగానికి గురైతే మాటలు రావంటారు. ప్రస్తుతం నేను నా పరిస్థితి అలాగే ఉంది. నా ఎమోషన్స్‌ను చెప్పేందుకు మాటలు రావడం లేదు" అని చెర్రీ అన్నాడు. ఇండియాతోపాటు అమెరికాలోనూ సంచలనాలు సృష్టించిన తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అక్టోబర్‌ 21న జపాన్‌లోనూ రిలీజైన విషయం తెలిసిందే.

IPL_Entry_Point