Allu Aravind comments: రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో మల్టీ స్టారర్.. టైటిల్ కూడా ఫిక్స్ చేశా: అల్లు అరవింద్
Allu Aravind comments: రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో మల్టీ స్టారర్ తీయాలని ఉందని.. దీనికి టైటిల్ కూడా ఫిక్స్ చేశానంటూ నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Allu Aravind comments: మల్టీ స్టారర్ మూవీస్‌కి ఇప్పుడు ఫుల్ క్రేజ్. టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ప్రభాస్, రానా.. రానా, పవన్ కల్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లాంటి కాంబినేషన్‌లు కాసుల వర్షం కురిపించాయి. హీరోల ఇమేజ్‌లు, ఫ్యాన్స్ మధ్య గొడవలను సవాలుగా తీసుకొని మరీ డైరెక్టర్లు మల్టీస్టారర్లు తీయడానికి ధైర్యం చేస్తున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు.
దీంతో ఇలాంటి మల్టీస్టారర్లు మరిన్ని రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా మెగాభిమానులైతే రామ్‌చరణ్, అల్లు అర్జున్ కలిసి నటిస్తే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి ఫ్యాన్స్ అందరికి గుడ్‌న్యూస్ చెప్పాడు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. తన తనయుడు, మేనల్లుడుతో ఓ సినిమా తీయాలని ఉందని అతడే చెప్పడం విశేషం. అంతేకాదు దీనికి టైటిల్ కూడా ఫిక్స్ చేసేశాడట. దీనిని ప్రతి ఏటా రెనివల్ కూడా చేయించుకుంటూ వెళ్తున్నట్లు అల్లు అరవింద్ చెప్పాడు.
"అల్లు అర్జున్, రామ్‌చరణ్ కలిసి స్క్రీన్‌పై కనిపించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. అది చేసి చూపించాలనీ అనుకుంటున్నాను. ఇప్పటికే చరణ్-అర్జున్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టాను. ప్రతి ఏటా రెనివల్ కూడా చేయిస్తున్నాను. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అనుకుంటున్నాను" అని ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ అల్లు అరవింద్ చెప్పడం విశేషం.
చిరంజీవి భార్య సురేఖ.. అల్లు అరవింద్ చెల్లెలు అన్న విషయం తెలుసు కదా. ఆ లెక్కన రామ్‌చరణ్.. అరవింద్‌కు మేనల్లుడు అవుతాడు. ఇక రామ్‌చరణ్, అల్లు అర్జున్ బావబావమరదులు. ఈ ఇద్దరూ అద్భుతమైన నటులు, డ్యాన్సర్లు. అలాంటి వీళ్లు స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని కోరుకోని ఫ్యాన్స్ ఎవరు ఉంటారు? అయితే అలాంటి ప్రాజెక్ట్ చేసే ఆలోచన ఉన్నదని అల్లు అరవిందే చెప్పడంతో త్వరలోనే తమ కల నెరవేరుతుందన్న ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్‌తో బిజీ అయ్యాడు. అటు రామ్‌చరణ్ కూడా శంకర్ డైరెక్షన్‌లో ఆర్సీ15లో నటిస్తున్నాడు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్ల కోసం రామ్‌చరణ్ జపాన్ కూడా వెళ్లాడు. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన చెర్రీ.. ఆర్సీ15పై కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు.