Ram Charan Take off to Japan: జపాన్‌కు ప్రయాణమైన చరణ్.. ఎందుకో తెలుసా?-ram charan fly to japan with his wife upasama ahead o rrr release there ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Take Off To Japan: జపాన్‌కు ప్రయాణమైన చరణ్.. ఎందుకో తెలుసా?

Ram Charan Take off to Japan: జపాన్‌కు ప్రయాణమైన చరణ్.. ఎందుకో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Oct 18, 2022 12:42 PM IST

Ram Charan Take off to Japan: ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పుడు జపాన్‌లోనూ సందడి చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాను జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. ఇందులో భాగంగా ప్రమోషన్ల కోసం రామ్ చరణ్ అక్కడకు ప్రయాణమయ్యాడు.

భార్య ఉపాసనతో రామ్ చరణ్
భార్య ఉపాసనతో రామ్ చరణ్

Ram Charan Take off to Japan: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకు ఫుల్ ఫిదా అయ్యారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షాన్ని కురిపించిన ఆర్ఆర్ఆర్.. ఓటీటీ వేదికపై కూడా ట్రెండింగ్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జపాన్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సినిమాను అక్టోబరు 21న విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ప్రమోషన్ల కోసం రామ్ చరణ్ జపాన్‌కు బయలదేరాడు.

తన సతీమణి ఉపాసనతో కలిసి ప్రైవేట్ ఛార్టెడ్ ఫ్లైట్‌లో జపాన్‌కు వెళ్లాడు. ప్రస్తుతం ఉపాసనతో కలిసి రామ్ చరణ్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో చరణ్‌తో పాటు ఆయన భార్య ఉపాసన, పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. విమానాశ్రయంలో దిగినట్లు అర్థమవుతుంది. ఈ శుక్రవారం నాడు జపాన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

జపాన్‌లో చిత్ర ప్రమోషన్ల కోసం రామ్ చరణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కూడా చేరనున్నారు. జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అలాగే బాహుబలి సినిమాతో జపాన్ ప్రేక్షకుల ఆదరణ పొందాడు జక్కన్న. ఈ కారణంగా జపాన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేసి అక్కడ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలని చిత్రబృందం చూస్తోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ నటి ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం