Prabhas Varsham Re Release Date: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌ - వ‌ర్షం రీ రిలీజ్ డేట్ చెప్పిన‌ ప్రొడ్యూస‌ర్‌-prabhas varsham re release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Varsham Re Release Date: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌ - వ‌ర్షం రీ రిలీజ్ డేట్ చెప్పిన‌ ప్రొడ్యూస‌ర్‌

Prabhas Varsham Re Release Date: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌ - వ‌ర్షం రీ రిలీజ్ డేట్ చెప్పిన‌ ప్రొడ్యూస‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 09, 2022 02:09 PM IST

Prabhas Varsham Re Release Date: ప్ర‌భాస్ కెరీర్‌లో క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచిన వ‌ర్షం సినిమా రీ రిలీజ్ కాబోతున్న‌ది. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 4కే టెక్నాల‌జీలో ఈ సినిమాను మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు నిర్మాత ప్ర‌క‌టించాడు.

ప్ర‌భాస్‌, త్రిష‌
ప్ర‌భాస్‌, త్రిష‌

Prabhas Varsham Re Release Date: ప్ర‌భాస్ కెరీర్‌లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన వ‌ర్షం సినిమా మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత ఎం.ఎస్‌.రాజు ప్ర‌క‌టించాడు.

శోభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన వ‌ర్షం సినిమాతోనే ప్ర‌భాస్ మాస్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మూడు నందుల‌తో పాటు ప‌లు అవార్డుల‌ను ఈ సినిమా ద‌క్కించుకున్న‌ది.

ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 22, 23 తేదీల‌లో తెలంగాణ‌తో పాటు ఏపీలో ఈసినిమాను రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు నిర్మాత ఎం.ఎస్.రాజు ప్ర‌క‌టించాడు. 4కే టెక్నాల‌జీతో వ‌ర్షం సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు పేర్కొన్నారు. వ‌ర్షంతో పాటు ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రెబెల్, బిల్లా సినిమాలు కూడా ఈ నెల‌లోనే రీ రిలీజ్ కానున్నాయి. రెబెల్ సినిమాను అక్టోబ‌ర్ 15న విడుద‌ల‌చేయ‌బోతున్నారు. బిల్లా రీ రిలీజ్ డేట్‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

కాగా వ‌ర్షం సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాలో దేవిశ్రీప్ర‌సాద్ స్వ‌ర‌ప‌ర‌చిన పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. వ‌ర్షం సినిమాలో హీరో గోపీచంద్ విల‌న్‌గా న‌టించాడు. దాదాపు ఆరు కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా మూడింత‌ల లాభాల్ని తెచ్చిపెట్టింది.

వ‌ర్షం సినిమాతోనే కెరీర్‌లో తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆదిపురుష్, స‌లార్‌, ప్రాజెక్ట్ కేతో పాటు ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తూ ప్ర‌భాస్ బిజీగా ఉన్నాడు.

IPL_Entry_Point