Jr NTR Craze in Japan: ఆర్‌ఆర్‌ఆర్ క్రేజ్.. జపాన్ మీడియాతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్
Jr NTR Craze in Japan: ఆర్‌ఆర్‌ఆర్ క్రేజ్ ఎల్లలు దాటిపోయిందనడానికి ఇదే నిదర్శనం. తాజాగా ఈ మూవీలో భీమ్‌గా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్.. జపాన్ మీడియాతో మాట్లాడాడు.
Jr NTR Craze in Japan: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇన్నాళ్లూ టాలీవుడ్‌లో తిరుగులేని హీరో. నందమూరి వంశ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తారక్.. నటనలో అదరగొడతాడన్న పేరుంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో అతని క్రేజ్ ఇండియా మొత్తం కాదు కదా విదేశాలకూ పాకింది. ఈ సినిమాలో జూనియర్ నటనకు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఫిదా అయినట్లు మనం చదివాం.
ట్రెండింగ్ వార్తలు
ఇక ఇప్పుడు జపాన్ మీడియా కూడా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూసి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ తీసుకోవడం విశేషం. తాను అక్కడి మీడియాతో మాట్లాడుతున్న ఫొటోను తారక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. "ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అనుభూతిని జపనీస్ మీడియాతో తిరిగి ఆస్వాదిస్తున్నాను. మీ ప్రేమ, ప్రశంసలకు కృతజ్ఞతలు" అని తారక్ క్యాప్షన్ ఉంచాడు.
రెండు వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలిసి బ్రిటీష్ వారిపై పోరాడితే ఎలా ఉంటుందన్న వెరైటీ కాన్సెప్ట్‌తో ఆర్‌ఆర్ఆర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా దేశ, విదేశాల్లో బ్లాక్‌బస్టర్ అయింది. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తూ 1200 కోట్లకుపైగా వసూలు చేసింది.
ఇందులో భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ అందులో జీవించేశాడు. ఇక ఈ మూవీ ఆస్కార్స్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తూ ప్రస్తుతం అమెరికాలో స్పెషల్ స్క్రీనింగ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యే లాస్ ఏంజిల్స్‌లోని చైనీస్ థియేటర్‌లో ఆర్‌ఆర్ఆర్‌ను ప్రదర్శించగా మూవీ అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న డైరెక్టర్ రాజమౌళికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు ప్రేక్షకులు.
ఈ వీడియోను రాజమౌళి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. ఈ ప్రశంసలకు నువ్వు అర్హుడివే జక్కన్న అంటూ రీట్వీట్ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఇప్పటి వరకూ ఇంకా ఏ సినిమా మొదలుపెట్టని జూనియర్.. తర్వలోనే కొరటాల శివతో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తోనూ సినిమా చేయనుండటం విశేషం.
టాపిక్