Rajamouli in American Talk Show: ఈ ఘనత సాధించిన తొలి భారతీయ దర్శకుడు రాజమౌళి-rajamouli in american talk show late night with seth meyers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli In American Talk Show: ఈ ఘనత సాధించిన తొలి భారతీయ దర్శకుడు రాజమౌళి

Rajamouli in American Talk Show: ఈ ఘనత సాధించిన తొలి భారతీయ దర్శకుడు రాజమౌళి

Hari Prasad S HT Telugu
Jan 10, 2023 10:23 AM IST

Rajamouli in American Talk Show: దర్శకుడు రాజమౌళి ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఇప్పటి వరకూ ఏ భారతీయ దర్శకుడికీ దక్కని అరుదైన గౌరవం ఇది.

లేట్ నైట్ విత్ సేత్ మేయెర్స్ షోలో రాజమౌళి
లేట్ నైట్ విత్ సేత్ మేయెర్స్ షోలో రాజమౌళి

Rajamouli in American Talk Show: దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి మూవీతో పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా పేరుగాంచాడు. ఆ సినిమా సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా మొత్తం దేశంలో సంచలనం సృష్టించింది. నిజానికి నార్త్‌లోనే ఎక్కువ వసూళ్లు సాధించింది. ఆ మూవీతో రాజమౌళి క్రేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో గతేడాది అతడు తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కూడా అదే స్థాయిలో విజయం సాధించి భారీ వసూళ్లు రాబట్టింది.

అయితే ఈసారి రాజమౌళి రేంజ్‌ పాన్‌ ఇండియా నుంచి పాన్‌ వరల్డ్‌ లెవల్‌కు వెళ్లింది. ఈ సినిమా ఇండియాలో సక్సెసైన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో జక్కన్న చేసిన మార్కెటింగ్‌తో ఆస్కార్స్‌, గోల్డెన్‌ గ్లోబ్స్‌లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్‌ అయ్యే స్థాయికి ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్లింది. అదే సమయంలో ఈ సినిమాతోపాటు రాజమౌళి కూడా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు మరో అరుదైన ఘనత కూడా రాజమౌళి ఖాతాలో చేరింది. పాపులర్‌ అమెరికన్‌ టాక్‌ షోలలో ఒకటైన లేట్‌ నైట్‌ విత్‌ సేత్‌ మేయెర్స్‌ షోకు రాజమౌళి రానున్నాడు. ఈ షో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం (జనవరి 9) రాత్రి టెలికాస్ట్ అయింది. ఈ విషయాన్ని ఈ టాక్ షో అధికారిక ట్విటర్‌ ద్వారా అనౌన్స్‌ చేశారు. రాజమౌళితోపాటు ఈ షోలో M3gan నటి అలీసన్‌ విలియమ్స్‌ కూడా పార్టిసిపేట్‌ చేయనుంది.

ఈ షోలో తన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ గురించి రాజమౌళి మాట్లాడనున్నాడు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ మొత్తం అమెరికాలోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడి లాస్‌ ఏంజిల్స్‌లోని అతిపెద్ద ఐమ్యాక్స్‌ టీఎల్‌సీ చైనీస్‌ థియేటర్‌లో ఆర్ఆర్‌ఆర్‌ సినిమాను వీళ్లు చూశారు. ఇప్పుడు బుధవారం (జనవరి 11) జరగబోయే గోల్డెన్‌ గ్లోబ్స్‌ అవార్డుల సెర్మనీకి హాజరు కానున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ బెస్ట్‌ పిక్చర్‌తోపాటు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీల్లో ఈ అవార్డుల కోసం నామినేట్‌ అయింది. వీటిలో ఏదో ఒక అవార్డు వస్తుందన్న ఆశతో మూవీ టీమ్‌ ఉంది. ఒకవేళ గోల్డెన్‌ గ్లోబ్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ కాగలిగితే.. ఆస్కార్స్‌లోనూ దీనికి మంచి ఛాన్స్‌ ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం