Rajamouli - Nyfcc Awards: బెస్ట్ డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళికి హాలీవుడ్ పుర‌స్కారం-rajamouli bags best director award for rrr at new york film critics circle ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajamouli Bags Best Director Award For Rrr At New York Film Critics Circle

Rajamouli - Nyfcc Awards: బెస్ట్ డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళికి హాలీవుడ్ పుర‌స్కారం

Nelki Naresh Kumar HT Telugu
Jan 05, 2023 10:13 AM IST

Rajamouli - Nyfcc Awards: ఆర్ఆర్ఆర్ సినిమాకు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క హాలీవుడ్ అవార్డ్‌ ద‌క్కింది. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్‌లో ఈ సినిమాకు ఏ విభాగంలో అవార్డ్ ద‌క్కిందంటే...

రాజ‌మౌళి
రాజ‌మౌళి

Rajamouli - Nyfcc Awards: హాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ (RRR) స‌త్తా చాటుతోంది. ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను సొంతం చేసుకుంటూ చ‌రిత్ర ను సృష్టిస్తోంది. తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ స‌ర్కిల్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాకుగాను బెస్ట్ డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళి ఎంపిక‌య్యాడు. బుధ‌వారం ఈ అవార్డ్ ప్ర‌దానోత్సవ వేడుక జ‌రిగింది. ఇందులో ప‌లువురు హాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌తో పోటీప‌డి రాజ‌మౌళి బెస్ట్ డైరెక్ట‌ర్‌గా అవార్డును అందుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి ఇండియ‌న్ డైరెక్ట‌ర్ గా రాజ‌మౌళి నిలిచాడు. ఈ అవార్డ్ వేడుక‌కు పూర్తిగా ఇండియ‌న్ ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో హాజ‌రై స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు రాజ‌మౌళి. కుర్తా, పైజామా ధ‌రించి వేడుక‌లో సంద‌డి చేశారు. ఈ అవార్డ్ వేడుక‌కు రాజ‌మౌళి హాజ‌రైన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. బెస్ట్ డైరెక్ట‌ర్‌గా అవార్డును అందుకొన్న రాజ‌మౌళికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు.

1935 నుంచి హాలీవుడ్‌లో న్యూయార్క్ ఫిల్మ్స్ క్రిటిక్స్ అవార్డుల‌ను ప్ర‌దానం చేస్తున్నారు. ఈ నెల 20న జ‌రుగ‌నున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌లో కూడా ఆర్ఆర్ఆర్ రెండు విభాగాల్లో పోటీప‌డ‌నున్న‌ది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగాల్లో నామినేష‌న్ ద‌క్కించుకున్న‌ది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుక‌ల‌కు రాజ‌మౌళితో పాటు ఎన్టీఆర్‌ (Ntr), రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) కూడా హాజ‌రుకానున్నారు.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న థియేట‌ర్ల‌లో రిలీజైంది. పీరియాడిక‌ల్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజు పాత్ర‌లో న‌టించ‌గా కొము

IPL_Entry_Point