Rahul Sipligunj : ఫేక్ సింపతీ ఎంతవరకు.. బిగ్ బాస్ రతికపై మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్
Bigg Boss 7 Telugu Rathika Rahul Sipligunj: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మల్లో రతిక రోజ్ ఒకరు. తొలి రోజు నుంచే గేమ్ డిఫరెంట్‍గా ఆడుతున్న రతికపై ఆమె ఎక్స్ బాయ్‍ఫ్రెండ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ పోస్ట్ వదిలాడు.
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి మొత్తంగా 14 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టగా.. వారిలో అందమైన ముద్దుగుమ్మ రతిక రోజ్ ఒకరు. పటాస్ ప్రియ అయిన ఈ బ్యూటి మోడలింగ్‍లోకి రతిక రోజ్‍గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో కంటెస్టెంట్‍గా అలరిస్తోంది. హౌజ్‍లో మొదట గేమ్‍తో ఆకట్టుకున్న రతిక రోజ్ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు కాస్తా చిరాకు పడేలా చేస్తుంది. ప్రశాంత్‍కు దెబ్బేసిన రతిక ఇప్పుడు ప్రిన్స్ యావర్‍తో మరో ట్రాక్ నడిపిస్తోంది.
మాజీ ప్రియుడి గురించి
ఇదిలా ఉంటే రతిక రోజ్ బిగ్ బాస్ హౌజ్‍లోకి ఎంట్రీ కాగానే ఆమె బాయ్‍ఫ్రెండ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అని వార్తలు వచ్చాయి. అలాగే వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరికి బ్రేకప్ అయిందని, రతిక మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ అని టాక్ నడిచింది. అయితే, హౌజ్‍లో అప్పుడప్పుడు తన ఎక్స్ బాయ్‍ఫ్రెండ్ గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంది రతిక. సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‍లో కూడా హీరో శివాజీతో తన ఎక్స్ బాయ్‍ఫ్రెండ్ గురించి ప్రస్తావన తీసుకొచ్చింది.
ఇతరులపై ఆదారపడి
తాజాగా రతిక రోజ్ గేమ్‍పై రాహుల్ సిప్లిగంజ్ పేరు చెప్పకుండా షాకింగ్ పోస్ట్ పెట్టాడు. "ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటివరకు? ప్రజలు ఎప్పుడూ తమ సొంత టాలెంట్‍ను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ, కొంతమంది మాత్రం నిత్యం ఇతరుల టాలెంట్, పేరుపై ఆధారపడుతుంటారు. అదే విషయాన్ని కొంతమంది నిరూపిస్తారు కూడా. ఫేమ్ కోసం అవసరానికి కన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. నీ లోపల ఉన్న మనిషికి ఆల్ ది బెస్ట్. అలాగే పైసలు (డబ్బులు) తీసుకున్న టీమ్‍కు కంగ్రాట్స్" అని రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు.
నెట్టింట్లో ట్రెండింగ్
ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ అంతా రతిక రోజ్ గురించే అని టాక్ నడుస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్, రతిక రోజ్ ఫొటోలు, బ్రేకప్ విషయం ట్రెండ్ అవుతోంది. హౌజ్‍లో కూడా రాహుల్ గురించి మాట్లాడటంపై అతను పరోక్షంగా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాహుల్ బిగ్ బాస్ 3 సీజన్‍లో విన్నర్‍గా నిలిచాడు. అనంతరం ఆస్కార్ స్టేజీపై నాటు నాటు సాంగ్ పాడేంతలా పేరు సంపాదించుకున్నాడు.