Raghava Lawrence: రజినీకాంత్‍కు పాదాభివనందం చేసిన లారెన్స్.. మూవీ రిలీజ్‍కు ముందు ఆశీర్వాదం
Chandramukhi 2 - Raghava Lawrence: తలైవా రజినీకాంత్ ఆశీర్వాదం తీసుకున్నారు రాఘవ లారెన్స్. చంద్రముఖి 2 సినిమా రిలీజ్‍కు ముందు రజినీని కలిశారు.
Chandramukhi 2 - Raghava Lawrence: స్టార్ కొరియోగ్రాఫర్‌గా పాపులర్ అయిన రాఘవ లారెన్స్.. నటుడిగానూ చాలా సినిమాల్లో మెప్పిస్తున్నారు. లారెన్స్ హీరోగా నటించిన చంద్రముఖి 2 సినిమా మరో రెండు రోజుల్లో (సెప్టెంబర్ 28) రిలీజ్ కానుంది. రజినీకాంత్ హీరోగా 2005లో తెరకెక్కిన చంద్రముఖి సినిమాకు ఇది సీక్వెల్. చంద్రముఖి 2 సినిమాలో లారెన్స్ హీరో కాగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్ర పోషించారు. ఈ చిత్రం తమిళంలో రూపొందగా.. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ కానుంది. మరో రెండు రోజుల్లో చంద్రముఖి 2 రిలీజ్ కానుండగా.. ఈ తరుణంలో కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‍ను రాఘవ లారెన్స్ కలిశారు.
రజినీకాంత్‍ను ఆయన నివాసంలో కలిశారు రాఘవ లారెన్స్. రజినీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు రాఘవ లారెన్స్. “నా తలైవర్, గురు రజినీకాంత్‍ను నేడు నేను కలిశా. జైలర్ సినిమా బ్లాక్‍బాస్టర్ అయినందుకు అభినందనలు తెలిపా. సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 రిలీజ్ కానుండటంతో ఆశీర్వాదం తీసుకున్నా. నేను చాలా సంతోషంగా ఉన్నా. తలైవా ఎప్పటికీ గ్రేట్. గురువే శరణం” అంటూ లారెన్స్ పోస్ట్ చేశారు.
రజీనికాంత్ చేసిన కొన్ని చిత్రాలకు రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. రజినీని దైవంగా, గురువుగా భావిస్తానని గతంలోనూ కొన్ని సందర్భాల్లో చెప్పారు లారెన్స్.
చంద్రముఖి చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాయినే ఇప్పుడు ‘చంద్రముఖి 2’ను కూడా తెరకెక్కించారు. 18ఏళ్ల క్రితం చిత్రంలో చంద్రముఖి ఆవహించిన అమ్మాయిగా జ్యోతిక నటించగా.. ఇప్పుడు వస్తున్న చంద్రముఖి 2లో చంద్రముఖి పాత్రను కంగన రనౌత్ పోషించారు. ఇటీవల వచ్చిన రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంది.
చంద్రముఖి 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు. హర్రర్ కామెడీ మూవీగా చంద్రముఖి 2 ఉండనుంది. ఈ సినిమాలో హర్రర్ ఎలిమిమెంట్స్ బోలెడు ఉన్నాయని, కచ్చితంగా భయపెడుతుందని మూవీ యూనిట్ చెబుతోంది.