Telugu Time Travel Movie: తెలుగులోకి వ‌చ్చిన క‌న్నడ టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఫ్రీగా ఎక్క‌డ చూడాలంటే?-priyanka upendra telugu time travel movie calling 1980 releasing on youtube kannada dubbing film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Time Travel Movie: తెలుగులోకి వ‌చ్చిన క‌న్నడ టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఫ్రీగా ఎక్క‌డ చూడాలంటే?

Telugu Time Travel Movie: తెలుగులోకి వ‌చ్చిన క‌న్నడ టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఫ్రీగా ఎక్క‌డ చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Aug 23, 2024 03:18 PM IST

Telugu Time Travel Movie: క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక ఉపేంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు మూవీ కాలింగ్ 1980 నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. .ఈ థ్రిల్ల‌ర్ మూవీలో ప్రియాంక ఉపేంద్ర డ్యూయ‌ల్ రోల్ చేసింది.

తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ
తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ

Telugu Time Travel Movie: క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక ఉపేంద్ర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు మూవీ కాలింగ్ 1980 డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ థ్రిల్ల‌ర్ మూవీకి రాజ్‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియాంక ఉపేంద్ర‌తో పాటు శ‌ర‌ణ్య శెట్టి, ర‌మేష్ పండిట్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

1980 డ‌బ్బింగ్ వెర్ష‌న్‌...

క‌న్న‌డంలో 2021లో రిలీజైన 1980కి డ‌బ్బింగ్ వెర్ష‌న్‌గా కాలింగ్ 1980 తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క‌న్న‌డంలో ఈ మూవీ డైరెక్ట్‌గా న‌మ్మ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజైంది. ఈ టైమ్ ట్రావెల్ మూవీ క‌న్నడంలో నెగెటివ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. కాన్సెప్ట్ బాగున్నా ఆడియెన్స్‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిపోయాడు.

హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో...

హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతూ ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ కాలింగ్ 1980 మూవీని తెర‌కెక్కించాడు. ఈ మూవీలో ప్రియా, సాన్వీ అనే రెండు పాత్ర‌ల్లో ప్రియాంక ఉపేంద్ర క‌నిపించింది.

1980లో ఆప్సేత‌ల్లి అనే విలేజ్‌లో వ‌రుస‌గా మిస్సింగ్ కేసులు న‌మోదు అవుతుంటాయి. మిస్సింగ్‌ల వెన‌కున్న మిస్ట‌రీని చేదించేందుకు ప్రియా అనే న‌వ‌ల ర‌చ‌యిత ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. ప్రియా ఇన్వేస్టిగేష‌న్‌లో త‌ర్వాత మిస్స‌య్యేది తానే అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది ఇంత‌లోనే ఆమె ల్యాండ్‌లైన్‌కు సాన్వీ అనే అమ్మాయి ఫోన్ చేసింది. 2020 సంవ‌త్స‌రం నుంచి ప్రియాతో సాన్వీ మాట్లాడుతుంది. కాలంలో ఇర‌వై ఏళ్లు వెన‌క్కి వెళ్లి ప్రియాతో సాన్వీ ఎలా మాట్లాడింది? కిడ్నాప‌ర్ల బారి నుంచి ప్రియాను సాన్వీ ఎలా సేవ్ చేసింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ప్యార‌లాల్ యూనివ‌ర్స్‌...

టైమ్ ట్రావెల్‌తో పాటు ప్యారలాల్ యూనివ‌ర్స్ అనే కాన్సెప్ట్‌ను ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్‌ కాలింగ్ 1980 మూవీలో ట‌చ్ చేశాడు. కాన్సెప్ట్‌, ట్విస్ట్‌ల‌తో పాటు ప్రియాంక ఉపేంద్ర యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అంటూ క‌న్న‌డంలో ఈ సినిమాపై ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కానీ ద‌ర్శ‌కుడి టేకింగ్‌, మిగిలిన నటీన‌టుల పేల‌వ‌మైన యాక్టింగ్ కార‌ణంగా క‌న్న‌డంలో 1980 యావ‌రేజ్ థ్రిల్ల‌ర్‌గా నిలిచిన‌ట్లు పేర్కొన్నారు.

తెలుగులో సినిమాలు...

ప్రియాంక ఉపేంద్ర తెలుగులో సూరి, రా సినిమాలు చేసింది.తెలుగు, క‌న్న‌డంలోనే కాకుండా త‌మిళం, బెంగాళీ భాష‌ల్లో హీరోయిన్‌గా ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది ప్రియాంక ఉపేంద్ర‌. క‌న్న‌డంలో ఉపేంద్ర‌కు జోడీగా ప‌లు సినిమాల్లో క‌నిపించిన ప్రియాంక‌ అత‌డితో ప్రేమ‌లో ప‌డింది.

2003లో ఉపేంద్ర‌, ప్రియాంక పెళ్లి జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది ప్రియాంక ఉపేంద్ర‌. ప్ర‌స్తుతం ప్రియాంక ఉపేంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న రెండు క‌న్నడ సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో డిటెక్టివ్ తీక్ష‌ణ‌తో పాన్ ఇండియ‌న్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది ప్రియాంక ఉపేంద్ర‌. ఆమె కెరీర్‌లో 50వ మూవీగా డిటెక్టివ్ తీక్ష‌ణ రిలీజ్ కాబోతోంది.