Priyamani: మా అందానికేం తక్కువ.. బాలీవుడ్ హీరోయిన్లు ఇంకాస్త ఫెయిర్‌గా ఉంటారంతే: ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-priyamani on being labeled as south indian actress says they are as good looking as bollywood actresses ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Priyamani On Being Labeled As South Indian Actress Says They Are As Good Looking As Bollywood Actresses

Priyamani: మా అందానికేం తక్కువ.. బాలీవుడ్ హీరోయిన్లు ఇంకాస్త ఫెయిర్‌గా ఉంటారంతే: ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Mar 28, 2024 05:06 PM IST

Priyamani: బాలీవుడ్ హీరోయిన్లంత ఫెయిర్ గా కాకపోయినా సౌత్ ఇండస్ట్రీ వాళ్లు కూడా అందంగానే ఉంటారంటూ ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నార్త్, సౌత్ అనే చర్చపై ఆమె స్పందించింది.

మా అందానికేం తక్కువ.. బాలీవుడ్ హీరోయిన్లు ఇంకాస్త ఫెయిర్‌గా ఉంటారంతే: ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మా అందానికేం తక్కువ.. బాలీవుడ్ హీరోయిన్లు ఇంకాస్త ఫెయిర్‌గా ఉంటారంతే: ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Priyamani: తమిళ నటే అయినా తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్న ప్రియమణి.. హిందీలోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా తాను నటించిన ఆర్టికల్ 370 మూవీ గురించి పింక్‌విల్లాతో మాట్లాడుతూ.. నార్త్, సౌత్ అనే తేడాపై స్పందించింది. బాలీవుడ్ హీరోయిన్లంత కాకపోయినా తాము కూడా అందగత్తెలమే అని ఆమె అనడం విశేషం.

ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. సాధారణంగా నార్త్ వెర్సెస్ సౌత్ అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలో బాలీవుడ్ లోనూ సౌత్ ఇండస్ట్రీకి చెందిన సినిమాలు దుమ్ము రేపుతుండటంతో క్రమంగా సౌత్ నటీనటులు, డైరెక్టర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నటీనటులు తరచూ బాలీవుడ్ మూవీస్ లోనూ కనిపిస్తున్నారు.

తాజాగా ప్రియమణి కూడా ఆర్టికల్ 370 మూవీలో నటించింది. ఈ సందర్భంగా ఆమె ఈ నార్త్, సౌత్ చర్చపై మాట్లాడింది. బాలీవుడ్ వాళ్లు కాస్త ఫెయిర్ గా ఉంటారన్న మాట నిజమే కానీ.. తాము కూడా ఎవరికీ తక్కువ కాదని ఆమె స్పష్టం చేసింది. "సౌత్ ఇండియా పాత్ర కాబట్టి మీకు ఈ అవకాశం ఇస్తున్నామని కొన్నిసార్లు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అంటారు. తొందర్లోనే ఇందులో మార్పు వస్తుందని భావిస్తున్నాను.

మేము సౌత్ ఇండియా వాళ్లమే అయినా.. మేము ఈ భాష (హిందీ)ను అనర్గళంగా మాట్లాడగలం. అంతేకాదు మేము చాలా అందంగా కూడా ఉంటాం. మా మేని ఛాయ బాలీవుడ్ వాళ్లంత ఫెయిర్ గా ఉండకపోవచ్చు కానీ అది పెద్ద విషయం కాదు. సౌత్ నుంచి వచ్చే నటీనటులందరికీ భాష తెలుసు. వాళ్లు అనర్గళంగా మాట్లాడగలరు. గ్రామర్ తప్పిదాలు ఉన్నా భావోద్వేగాలు సరిగ్గా పలికించినంత వరకూ అదేమంత పెద్ద విషయం కాదు. ఇక నార్త్, సౌత్ అనేది ఉండకూడదు. మనమందరం ఎప్పుడూ ఇండియన్ యాక్టర్సే" అని ప్రియమణి స్పష్టం చేసింది.

బాలీవుడ్ వాళ్లకు దిమ్మదిరిగే సమాధానం

నార్త్, సౌత్ అనే చర్చకు, బాలీవుడ్ వాళ్లకు ప్రియమణి కాస్త గట్టి సమాధానమే ఇచ్చింది. నటనలోనే కాదు అందంలోనూ తాము తక్కువ కాదని ఆమె చెప్పిన తీరు అభిమానులకు తెగ నచ్చేసింది. చాన్నాళ్లుగా సౌత్ నటీనటులంటే బాలీవుడ్ వాళ్లకు చిన్నచూపే ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ఇక్కడి సినిమాలు అక్కడి బాక్సాఫీస్ ను కూడా ఏలుతుండటం, అదే సమయంలో అక్కడి సినిమాలు బోల్తాపడుతుండటంతో వాళ్లు మెల్లగా దిగి వస్తున్నారు.

ఇక ప్రియమణి విషయానికి వస్తే ఇప్పటికే చెన్నై ఎక్స్‌ప్రెస్, జవాన్ సినిమాల్లో షారుక్ తో కలిసి స్పెషల్ సాంగ్స్ లో నటించింది. ఆర్టికల్ 370తో పూర్తి స్థాయి హిందీ మూవీలోనూ నటించింది. ఈ సినిమాలో యామీ గౌతమ్ కూడా నటించింది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 వల్ల జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టేలా ఈ సినిమా తీశారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తోనూ నార్త్ వాళ్లకు దగ్గరైంది. 2003లో ఎవరే అతగాడు మూవీతో తెలుగు వాళ్లకు ప్రియమణి పరిచయమైంది.

WhatsApp channel