Dhanush vs Nayanthara: నయనతార, ఆమె భర్తపై కోర్టుకెక్కిన ధనుష్.. మరింత ముదిరిన వివాదం
Dhanush vs Nayanthara: నయనతార, ధనుష్ మధ్య వివాదం మరింత ముదిరింది. తాజాగా ఆమెతోపాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ లపై మద్రాస్ హైకోర్టులో ధనుష్ దావా వేయడం గమనార్హం.
Dhanush vs Nayanthara: ధనుష్ అన్నంత పని చేశాడు. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా తన నానుమ్ రౌడీ దాన్ మూవీ విజువల్స్ వాడారంటూ మద్రాస్ హైకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశాడు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ లపై ధనుష్ కోర్టుకెక్కడం గమనార్హం.
ధనుష్ వర్సెస్ నయనతార
ధనుష్, నయనతార మధ్య వివాదం మరింత ముదిరింది. ది హిందూలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. నయనతారపై మద్రాస్ హైకోర్టులో ధనుష్ సివిల్ సూట్ దాఖలు చేశాడు. అతనికి చెందిన వుండెర్‌బర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నయనతార, విఘ్నేష్ శివన్ లపై ఈ సూట్ వేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీలో తమ మూవీ నానుమ్ రౌడీ దా నుంచి కొన్ని విజువల్స్ వాడుకున్నట్లు అందులో పేర్కొంది.
ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చూసుకునే లాస్ గాటోస్ ప్రొడక్షన్ పై దావా వేసేలా అనుమతి ఇవ్వాలని కూడా మద్రాస్ హైకోర్టును ధనుష్ కంపెనీ కోరింది. ఇద్దరి వాదనలు విన్న కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. నయనతార వచ్చే విచారణ తేదీలోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
అసలేంటి వివాదం?
తన డాక్యుమెంటరీలో ఆ మూవీకి సంబంధించిన విజువల్స్ వాడకుండా ధనుష్ తనపై ఒత్తిడి తెస్తున్నాడంటూ అప్పట్లో నయనతార ఆరోపించింది. అయితే ఆ మూవీ బిహైండ్ ద సీన్స్ కు సంబంధించి మూడు సెకన్ల వీడియో వాడినందుకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు పంపించాడు. ఈ ఘటన తర్వాత వీళ్లిద్దరూ గత వారం చెన్నైలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు.
అయితే అక్కడ వీళ్లు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు. నానుమ్ రౌడీ దాన్ మూవీ 2015లో రిలీజైంది. ఆ సినిమాలో నయనతార నటించగా.. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేశాడు. ఆ మూవీని ధనుష్ నిర్మించాడు. ఆ సినిమా నుంచే నయన్, విఘ్నేష్ మధ్య ప్రేమ చిగురించింది. ఏడేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2022లో పెళ్లి చేసుకున్నారు.
ధనుష్‌పై నయన్ ఫైర్
ఈ చిన్న క్లిప్ కోసం వేధిస్తున్న ధనుష్ పై ఫైర్ అవుతూ ఆ మధ్య నయన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద పోస్టే చేసింది. "నా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డాక్యుమెంటరీ కోసం కొంతమంది సినీ ప్రముఖులు సహాయం చేశారు. కానీ, నీకు మాపై పగ ఉంది. అది ఈ డాక్యుమెంటరీ కోసం కష్టపడిన వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది.
నా ఆత్మీయులు చెప్పిన మాటలు నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ, నాకు ఎంతో స్పెషల్ అయిన నేను రౌడీనే క్లిప్స్ మాత్రం వాడలేకపోయాం. అందులోని సాంగ్స్ డాక్యుమెంటరికీ చాలా బాగా సెట్ అవుతాయి. అందుకోసం నిన్ను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కలు చేసింది" అని నయనతార చెప్పింది.