Pragya Jaiswal: ఎట్టకేలకు ప్రగ్యా జైస్వాల్‌కు ఓ లక్కీ ఛాన్స్ దక్కింది - బాలీవుడ్ మూవీలో అక్షయ్ కుమార్‌తో రొమాన్స్
Pragya Jaiswal: రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రగ్యాజైస్వాల్ ఓ లక్కీ ఛాన్స్‌ను సొంతం చేసుకున్నది బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నది. ఖేల్ ఖేల్ మే పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది.
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లు దాటిపోయింది. బాలకృష్ణ అఖండతో పెద్ద హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సన్ ఆఫ్ ఇండియాలో నటించింది. 2022లో రిలీజైన ఈ మూవీ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో ప్రగ్యాజైస్వాల్ సినిమాలకు దూరమైంది.
అక్షయ్ కుమార్ మూవీలో...
గత రెండేళ్లుగా రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న ఈ బ్యూటీ ఓ లక్కీ ఛాన్స్‌ను సొంతం చేసుకున్నది. బాలీవుడ్ మూవీలో అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్ చేయబోతున్నది. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే పేరుతో కామెడీ డ్రామా మూవీ రూపొందుతోంది.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తోన్నారు. తాప్సీ, వాణికపూర్‌తోపాటు ప్రగ్యాజైస్వాల్ మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నది. ఈ మూవీలో ప్రగ్యాజైస్వాల్ నటిస్తోన్న విషయాన్ని చిత్ర యూనిట్ ఆఫీషియల్‌గా ప్రకటించింది.
ఆగస్ట్ 15న రిలీజ్...
ఖేల్ ఖేల్ మే మూవీని ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప 2కు పోటీగా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. అదే రోజు బాలీవుడ్‌లో జాన్ అబ్రహం వేదా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పదేళ్ల తర్వాత రీఎంట్రీ...
కాగా ఖేల్ ఖేల్ మే మూవీతో పదేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది ప్రగ్యాజైస్వాల్. 2014లో హిందీలో వ టిటూ ఎమ్‌బీఏ పేరుతో మూవీ చేసింది ప్రగ్యాజైస్వాల్. ఈ లవ్ స్టోరీతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
కానీ ఫస్ట్ మూవీనే ఫ్లాప్ కావడంతో హిందీలో ప్రగ్యాజైస్వాల్‌కు అవకాశాలు రాలేదు. దాంతో టాలీవుడ్ బాట పట్టింది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఖేల్ ఖేల్ మే మూవీతో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నది ప్రగ్యా జైస్వాల్. అక్షయ్ మూవీతోనే నైనా ప్రగ్యాజైస్వాల్ బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటుందో...ఆమెకు ఈ మూవీ బ్రేక్ ఇస్తుందో లేదో చూడాల్సిందేనని సినీ వర్గాలు చెబుతోన్నాయి.
మిర్చిలాంటి కుర్రాడుతో...
2015లో బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించిన మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యాజైస్వాల్. పదేళ్లలో కంచె, అఖండ మినహా ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. గుంటూరోడు, నక్షత్ర, ఆచారి అమెరికా యాత్రతో పాటు మరికొన్ని సినిమాలు చేసినా ఫ్లాప్ అయ్యాయి. తొమ్మిదేళ్ల టాలీవుడ్ కెరీర్‌లో కేవలం ఎనిమిది సినిమాలు మాత్రమే చేసింది. జయజానకి నాయక సినిమాలో ఐటెంసాంగ్ చేసింది.
అఖండతో పెద్ద హిట్...
బాలకృష్ణ అఖండలో హీరోయిన్‌గా నటించిన ప్రగ్యాజైస్వాల్ ఈ మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నది. ఈ మూవీతో ఆమె టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం ఖాయమని, అవకాశాలు క్యూ కడతాయని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు.
అఖండ తర్వాత కేవలం సన్ ఆఫ్ ఇండియాలో మాత్రమే కనిపించింది. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ఓ మ్యూజిక్ వీడియో చేసి అది ఆమె కెరీర్‌కు ఏ విధంగాను ఉపయోగపడలేకపోయింది.సినిమాల పరంగా హిట్స్ లేకపోయినా సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది ప్రగ్యాజైస్వాల్. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగ్యాజైస్వాల్‌కు మూడు మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
టాపిక్