Prabhas: ప్రభాస్‌ని పొగిడి ఫ్యాన్స్‌తో మళ్లీ తిట్టించుకున్న డైరెక్టర్ ఓం రౌత్, వెంటాడుతున్న ఆదిపురుష్ ఎఫెక్ట్-prabhas fans troll om raut for calling adipurush a box office success ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas: ప్రభాస్‌ని పొగిడి ఫ్యాన్స్‌తో మళ్లీ తిట్టించుకున్న డైరెక్టర్ ఓం రౌత్, వెంటాడుతున్న ఆదిపురుష్ ఎఫెక్ట్

Prabhas: ప్రభాస్‌ని పొగిడి ఫ్యాన్స్‌తో మళ్లీ తిట్టించుకున్న డైరెక్టర్ ఓం రౌత్, వెంటాడుతున్న ఆదిపురుష్ ఎఫెక్ట్

Galeti Rajendra HT Telugu
Aug 30, 2024 06:55 AM IST

Director Om Raut: డైరెక్టర్‌ ఓం రౌత్‌ను ఆదిపురుష్ చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతున్నాయి. ప్రభాస్‌ను పొగడాలని ప్రయత్నించిన ఓం రౌత్ మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్‌కి అడ్డంగా దొరికిపోయాడు.

ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్
ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ (PTI)

రెబల్ స్టార్ ప్రభాస్‌‌ను పొగిడిన డైరెక్టర్ ఓం రౌత్‌ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. భారీ అంచనాలతో గత ఏడాది విడుదలైన ఆదిపురుష్ మూవీ ప్రభాస్‌కి ఊహించని చేదు అనుభవాన్ని మిగిల్చింది. చివరికి ప్రభాస్‌ ఫ్యాన్స్‌‌కి కూడా ఈ సినిమా నచ్చలేదు. సినిమాకి ముందు ఓం రౌత్ ఇచ్చిన బిల్డప్‌, హైప్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ చివరికి మూవీ ఓ ట్రోల్ ప్రొడెక్ట్‌గా మిగిలిపోవడంతో ఓం రౌత్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజులో విరుచుకుపడుతూ వస్తున్నారు.

ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ వరుసగా చేసిన సలార్, కల్కి 2898AD సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. దాంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఓం రౌత్.. ప్రభాస్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. సల్మాన్ ఖాన్, ప్రభాస్ సినిమాలు నిరాశపరిచినా వారి క్రేజ్, ఇమేజ్ కొంచెం కూడా తగ్గదని ప్రశంసించాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ మళ్లీ ఆదిపురుష్ సినిమా టాపిక్‌ను తీసుకొచ్చి మర్చిపోయిన చేదు అనుభవాన్ని ఫ్యాన్స్‌కి గుర్తు చేశాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఓం రౌత్‌ను సోషల్ మీడియా ఉతికారేస్తున్నారు.

ఓం రౌత్ ఎదురుదాడి

ఓ సినిమా ప్లాప్ లేదా హిట్ అనేది బాక్సాఫీస్ డిసైడ్ చేస్తుంది. ముక్కు, మొహం తెలియని వాళ్లు ట్రోల్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆదిపురుష్ మూవీ తొలిరోజే రూ.70 కోట్లు వసూళ్లు రాబట్టిందని, ఓవరాల్‌గా రూ.400 కోట్లకిపైగా కలెక్షన్లు వచ్చినట్లు లెక్కలతో సహా ఓం రౌత్ వివరణ ఇచ్చాడు. కానీ ఓం రౌత్ వాదనతో ప్రభాస్ ఫ్యాన్స్ ఏకీభవించట్లేదు.

కూల్ చేయబోయి దొరికాడా?

వాస్తవానికి ఆదిపురుష్ సినిమా ఎవ్వరికీ నచ్చలేదని డైరెక్టర్ ఓం రౌత్‌కి కూడా తెలుసు. కానీ ప్రభాస్‌‌ ఫ్యాన్స్‌ని కూల్ చేయాలని గత 6-7 నెలలుగా అతను విశ్వప్రయత్నం చేస్తున్నాడు. బహిరంగ వేదికలు, ఇంటర్వ్యూల్లో మాట్లాడిన ప్రతిసారి ఆదిపురుష్, ప్రభాస్ గురించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రస్తావిస్తూనే ఉన్నాడు. కానీ ప్రతిసారీ ప్రభాస్ ఫ్యాన్స్ అతనిపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తావన లేకుండా మాట్లాడలేవా? అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ ఓం రౌత్ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు.

ఏప్రిల్‌లో రాబోతున్న రాజా సాబ్

సలార్, కల్కి 2898AD వరుసగా హిట్ అవడంతో ప్రభాస్ జోరుమీదున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కూడా క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా హీరోయిన్లు నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ నటిస్తున్నారు. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకు ప్రభాస్ కనిపించని రొమాంటిక్ హారర్‌ ఫిల్మ్‌ జానర్‌లో ఈ సినిమాని మారుతి తెరకెక్కిస్తున్నాడు. అలానే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్ సీక్వెల్ ‘సలార్‌: శౌర్యంగ పర్వం’ కూడా సెట్స్‌పై ఉంది. ఈ ఏడాదిలోనే సందీప్‌ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ మూవీని కూడా పట్టాలెక్కించే పనిలో ప్రభాస్ ఉన్నాడు.