Crime Thriller Movie: ఓటీటీలోకి రాబోతున్న లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Crime Thriller Movie: పాయల్ రాజ్‌పుత్ పోలీస్ రోల్‌లో నటించిన రక్షణ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Crime Thriller Movie: పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ రక్షణ ఓటీటీలోకి రాబోతోంది. . తెలుగులో ఫస్ట్ టైమ్ పాయల్ రాజ్‌పుత్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నటించిన ఈ మూవీకి ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించాడు
ఆహా ఓటీటీలో....
రక్షణ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో రిలీజైన 15 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతోన్నారు. జూన్ 21 నుంచి రక్షణ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రక్షణ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
బ్రహ్మముడిమానస్...
రక్షణ మూవీలో బ్రహ్మముడి మానస్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో కనిపించాడు. రోషన్, ఆనంద్‌చక్రపాణి, శివన్నారాయణ కీలక పాత్రల్లో కనిపించారు. జూన్ 7న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
రక్షణ కథ కొత్తగా ఉన్నా...కాన్సెప్ట్‌ను ఇంట్రెస్టింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. తొలుత ఈ సినిమాకు 5డబ్ల్యూఎస్ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమైంది.
రిలీజ్ విషయంలో నిర్మాతలతో ఏర్పడిన విభేదాల కారణంగా పాయల్ రాజ్‌పుత్ ఈ మూవీ ప్రమోషన్స్‌కు దూరమైంది.
రక్షణ మూవీ కథ...
ఉన్నత చదువులు చదివిని లైఫ్‌లో సక్సెస్ అయిన పలువురు అమ్మాయిలు సిటీలో వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. వారిలో ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ (పాయల్ రాజ్‌పుత్) ప్రాణ స్నేహితురాలు ప్రియా కూడా ఉంటుంది. ప్రియా మరణం వెనుక ఓ సైకో ఉన్నాడని కిరణ్ అనుమానిస్తుంది.
కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కిరణ్ మాటల్ని పోలీసులను నమ్మరు. ఈవ్‌టీజింగ్ కేసులో పట్టుబడ్డ అరుణ్ (బ్రహ్మముడి మానస్)ను హంతకుడిగా కిరణ్ అనుమానిస్తుంది. అరుణ్ సూసైడ్ చేసుకోవడంతో అందుకు కిరణ్ కారణమని అధికారులు ఆమెను సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది?
పోలీస్ జాబ్ నుంచి సస్పెండ్ అయినా కిరణ్ తన ఇన్వేస్టిగేషన్‌ను ఎలా కొనసాగించింది? ఈ ఇన్వేస్టిగేషన్‌లో అమ్మాయిల ఆత్మహత్యల గురించి ఆమె తెలుసుకున్న నిజాలేమిటి? ఈ మర్డర్స్‌కు రామ్ (రోషన్) అనే వ్యక్తితో ఏమైనా సంబంధం ఉందా? అసలు హంతకుడిని కిరణ్ పట్టుకుందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ఆర్ఎక్స్ 100తో ఎంట్రీ...
ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాలోనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన బోల్డ్ రోల్‌లో అదరగొట్టింది. చిన్న సినిమాగా రిలీజైన ఆర్ఎక్స్ 100 మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌తో తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నది పాయల్ రాజ్‌పుత్. వెంకీ మామ, డిస్కోరాజాతో పాటు ఆమె చేసిన పలు తెలుగు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలవడంతో పాయల్‌కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
మంగళవారం మూవీతో...
చాలా రోజుల తర్వాత గత ఏడాది రిలీజైన మంగళవారం మూవీతో ప్రేక్షకులను మెప్పించింది పాయల్. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మంగళవారం మూవీ 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలతో పాటు త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ సీజన్ 2లో నటిస్తోంది పాయల్ రాజ్‌పుత్. తమిళంలో గోల్‌మాల్ అనే మూవీ చేస్తోంది.