OTT Romantic Thriller: ఒకే ఓటీటీలోకి తెలుగులో వస్తున్న రెండు వేర్వేరు భాషల రొమాంటిక్ థ్రిల్లర్, థ్రిల్లర్ మూవీస్..
OTT Romantic Thriller: ఒకే ఓటీటీలోకి ఇప్పుడు తెలుగులో రెండు వేర్వేరు భాషల రొమాంటిక్ థ్రిల్లర్, థ్రిల్లర్ మూవీస్ రాబోతున్నాయి. ఓటీటీల్లో ఎంతో క్రేజ్ ఉండే ఈ జానర్ సినిమాలు అంతర్జాతీయ భాషల్లో తరచూ తెరకెక్కుతుండగా.. వాటిని తెలుగులోకి తీసుకొస్తుండటం విశేషం.
OTT Romantic Thriller: థ్రిల్లర్, రొమాంటిక్ థ్రిల్లర్.. ఈ రెండు జానర్ల సినిమాలను ఇష్టపడని ఓటీటీ ప్రేక్షకులు ఉండరు. అందులోనూ దేశీయంగానే కాదు.. అంతర్జాతీయ భాషల్లో తెరకెక్కిన సినిమాలు కూడా తెలుగులో వస్తున్నాయి. తాజాగా ఒకే ఓటీటీలోకి ఓ రొమాంటిక్ థ్రిల్లర్, థ్రిల్లర్ సినిమాలు రాబోతున్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో వస్తున్న ఆ సినిమాలు ఏంటో చూడండి.
ఓటీటీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ షుగర్ బేబీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. నిజానికి ఇదో రష్యన్ మూవీ. పోచెము టై పేరుతో ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో రిలీజైన మూవీ ఇది. ఇప్పుడు ఇండియాలో తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో ఓటీటీల్లోకి అడుగు పెడుతోంది. మరీ ఎక్కువ స్థాయిలో హింస, డైలాగులు, షాకింగ్ సీన్స్ వల్ల దీనిని ఆర్ రేటెడ్ మూవీగా చెబుతున్నారు.
ఈ రొమాంటిక్ థ్రిల్లర్ షుగర్ బేబీ మూవీ వ్రోట్ (Vrott) ఓటీటీలో వచ్చే ఏడాది జనవరి 17 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తోనూ చూడొచ్చు. ఇద్దరి మధ్య ప్రేమ, రిలేషన్షిప్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో అయినా అలాగే ఉంటుందా లేదా అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. అలెగ్జాండర్ ప్రాస్ట్ డైరెక్ట్ చేసిన ఈ షుగర్ బేబీ మూవీలో ఏంజెలెనా జాగ్రెబినా, డానీల్ వొరోబ్యోవ్, యూరియ్ సురిలో లాంటి వాళ్లు నటించారు.
ఓటీటీ థ్రిల్లర్ మూవీ
ఇక ఇదే వ్రోట్ (Vrott) ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ కూడా రాబోతోంది. చివరి వరకూ సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ.. ప్రేక్షకులను సీట్ల ఎడ్జ్ పై కూర్చోబెట్టే థ్రిల్లర్ సినిమాలు ఏ భాషలో ఉన్నా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడలాంటిదే ఓ ఇటాలియన్ మూవీ తెలుగులోకి వస్తోంది. రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజైన ది మ్యాన్ ఆన్ ద రోడ్ మూవీ ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తెలుగుతోపాటు హిందీ, తమిళంలలో వ్రోట్ ఓటీటీలోనే అందుబాటులోకి రానుంది. జనవరి 2, 2025 నుంచి ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలోనూ హింస కాస్త ఎక్కువగానే ఉండటంతో దీనిని కూడా ఆర్ రేటెట్ మూవీగానే పరిగణిస్తున్నారు.
ది మ్యాన్ ఆన్ ద రోడ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఓ దొంగల ముఠా చేతుల్లో ఆమె తండ్రి ప్రాణాలు కోల్పోతాడు. వాళ్లపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో చిన్నతనం నుంచే ఆమె పెరుగుతుంది. ఓ సారి అనుకోకుండా ఆ హత్య చేసిన వ్యక్తే ఆమెకు ఎదురు పడతాడు. ఆ తర్వాత ఆ ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగిందన్నది ది మ్యాన్ ఆన్ ద రోడ్ మూవీలో చూడొచ్చు.