OTT Romantic Thriller: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన డిజాస్టర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ..
OTT Romantic Thriller: ఓటీటీలోకి ఓ డిజాస్టర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిని ఈ సినిమాకు కేవలం రూ.12 కోట్లే రాగా.. ఇప్పుడీ సినిమాను రెంట్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
OTT Romantic Thriller: ఓటీటీలోకి తాజాగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు సుమారు 40 రోజుల తర్వాత ఓటీటీలోకి రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా పేరు ఔరో మే కహా దమ్ థా. అజయ్ దేవగన్, టబు నటించిన మూవీ ఇది.
ఔరో మే కహా దమ్ థా ఓటీటీ స్ట్రీమింగ్
హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఔరో మే కహా దమ్ థా అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా చూడాలంటే మాత్రం భారీగానే రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.349కి ఈ సినిమా రెంట్ తీసుకొని చూడొచ్చు.
థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఇంత భారీ రెంట్ చెల్లించడం ఆశ్చర్యం కలిగించేదే. ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ దారుణంగా బోల్తా పడింది. కేవలం రూ.12.91 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ఔరో మే కహా దమ్ థా మూవీ ఏంటి?
ఔరో మే కహా దమ్ థా మూవీలో అజయ్ దేవగన్, టబు నటించారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన పదో సినిమా కావడం విశేషం. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. నీరజ్ పాండే డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఓ జంట చుట్టూ తిరుగుతుంది. కృష్ణ (అజయ్ దేవగన్), వసుధ (టబు) లవ్ స్టోరీ ఏకంగా 23 ఏళ్ల పాటు సాగుతుంది.
పలు హత్య కేసుల్లో కృష్ణకు జైలు శిక్ష పడటంతో వసుధ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అయితే 22 ఏళ్ల తర్వాత కృష్ణకు క్షమాభిక్ష పెట్టడంతో అతడు జైలు నుంచి విడుదలవుతాడు. ఆ తర్వాత అతడు వసుధను కలుసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ల జీవితాల్లో ఏం జరగింది అన్నది ఈ ఔరో మే కహా దమ్ థా మూవీలో చూడొచ్చు.
అయితే ఈ సినిమాను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. భారీ బడ్జెట్ పెట్టి తీసినా.. తొలి రోజు అయిన ఆగస్ట్ 2న కేవలం రూ.1.85 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే లభించాయి. 2024లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఏకంగా రూ.148 కోట్ల నష్టాలు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇదే ఏడాది అజయ్ దేవగన్ కే చెందిన మైదాన్ కూడా భారీ నష్టాలను మిగిల్చిన విషయం తెలిసిందే.
టాపిక్