OTT Releases This Week: అవతార్ 2 నుంచి 2018 వరకు.. ఈ వారం ఓటీటీల్లో ఈ మూవీస్ మిస్ కావద్దు-ott releases this week from avatar 2 to 2018 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: అవతార్ 2 నుంచి 2018 వరకు.. ఈ వారం ఓటీటీల్లో ఈ మూవీస్ మిస్ కావద్దు

OTT Releases This Week: అవతార్ 2 నుంచి 2018 వరకు.. ఈ వారం ఓటీటీల్లో ఈ మూవీస్ మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu

OTT Releases This Week: అవతార్ 2 నుంచి 2018 వరకు.. ఈ వారం ఓటీటీల్లో ఈ మూవీస్ మిస్ కావద్దు. ఈసారి బుధవారం (జూన్ 7) నుంచే ఓటీటీల్లో సినిమాల సందడి మొదలు కానుంది.

అవతార్ ది వే ఆఫ్ వాటర్

OTT Releases This Week: ఈవారం ఓటీటీ పండగ ముందే ప్రారంభం కానుంది. బుధవారం (జూన్ 7) నుంచే కొన్ని హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఎన్నో నెలలుగా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవతార్ ది వే ఆఫ్ వాటర్ నుంచి మలయాళ సెన్సేషన్ 2018 వరకూ ఈ వారం కొన్ని మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

అవతార్ ది వే ఆఫ్ వాటర్

గతేడాది డిసెంబర్ 16న రిలీజై వేల కోట్ల వసూళ్లు సాధించిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ మొత్తానికి ఫ్రీగా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. బుధవారం (జూన్ 7) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లందరూ అవతార్ 2 చూడొచ్చు. ఈ సినిమా ఇంగ్లిష్ వెర్షన్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది.

2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో

మలయాళ సినిమా ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసిన మూవీ 2018. ఆ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన 2018.. మే 5న థియేటర్లలో రిలీజైంది. నెల రోజుల్లోనే అంటే బుధవారం (జూన్ 7) నుంచి ఈ మూవీ సోనీలివ్ (SonyLIV) ఓటీటీలో అందుబాటులోకి రానుంది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం వెర్షన్లను చూడొచ్చు.

బ్లడీ డాడీ

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించిన ఈ బ్లడీ డాడీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. జియో సినిమాలో శుక్రవారం (జూన్్ 9) నుంచి ఈ మూవీ స్ట్రీమ్ అవనుంది. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హిందీలో చూడొచ్చు.

నెవర్ హావ్ ఐ ఎవర్ 4

నెవర్ హావ్ ఐ ఎవర్ 4 నెట్‌ఫ్లిక్స్ లో రాబోతోంది. ఈ సిరీస్ గురువారం (జూన్ 8) నుంచి స్ట్రీమింగ్ కానుంది. దేవి అనే ఓ ఇండియన్ అమెరికన్ టీనేజ్ గర్ల్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సిరీస్ ఇంగ్లిష్ లో అందుబాటులో ఉంటుంది.

యూపీ65 (UP65)

యూపీ65 సిరీస్ అదే పేరుతో నిఖిల్ సచన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. బనారస్ లోని ఐఐటీ బీహెచ్‌యూ బ్యాక్‌డ్రాప్ లో సాగే స్టోరీ ఇది. ఈ కొత్త సిరీస్ గురువారం (జూన్ 8) నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది.

సంబంధిత కథనం