John Wick 4 OTT Release Date: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన హాలీవుడ్ యాక్ష‌న్ మూవీ జాన్ విక్ 4-keanu reeves john wick 4 ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  John Wick 4 Ott Release Date: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన హాలీవుడ్ యాక్ష‌న్ మూవీ జాన్ విక్ 4

John Wick 4 OTT Release Date: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన హాలీవుడ్ యాక్ష‌న్ మూవీ జాన్ విక్ 4

HT Telugu Desk HT Telugu
Jun 06, 2023 02:12 PM IST

John Wick 4 OTT Release Date: హాలీవుడ్ సూప‌ర్ హిట్ యాక్ష‌న్ మూవీ జాన్ విక్ 4 ఈ నెల‌లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే..

జాన్ విక్ 4
జాన్ విక్ 4

John Wick 4 OTT Release Date: జాన్ విక్ సిరీస్ సినిమాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్‌ను ఈ సినిమాలు మెప్పించాయి. జాన్ విక్‌ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సినిమాలొచ్చాయి. ఇటీవ‌లే రిలీజైన జాన్ విక్ 4 బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 2000 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ఇండియాలోనూ వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి స‌త్తా చాటింది. థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపించిన ఈ హాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ ఈ నెల‌లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో జూన్ 23 నుంచి జాన్ విక్ 4స్ట్రీమింగ్ కాబోతున్న‌ది.

గ‌త మూడు భాగాలు కూడా ల‌య‌న్స్‌ గేట్ ప్లే ఓటీటీలోనే రిలీజ‌య్యాయి. తాజాగా నాలుగో భాగాన్ని కూడా అదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుద‌ల‌చేయ‌బోతున్నారు. . ఈ సినిమాలో హీరో కీను రీవ్స్‌పై తెర‌కెక్కించిన భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకొన్నాయి. జాన్ విక్‌పై ప‌గ‌ను పెంచుకున్న శ‌త్రువులు అత‌డిని చంపిన వారికి న‌ల‌భై మిలియ‌న్ డాల‌ర్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తారు.

ఈ ప్ర‌క‌ట‌న‌తో జాన్ విక్ జీవితం ఎలా చిక్కుల్లో ప‌డింది. త‌న‌ను హ‌త్య చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన వారిని ఎదురించి జాన్ విక్ ఎలాంటి పోరాటం చేశాడ‌న్న‌దే జాన్ విక్ 4 క‌థ‌.

దాదాపు వంద మిలియ‌న్ డాల‌ర్ల వ్య‌యంతో జాన్ విక్ 4 ను రూపొందించారు. ఈ యాక్ష‌న్ మూవీకి చాడ్ స్టాలెస్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాకు కొన‌సాగింపుగా జాన్ విక్ 5 కూడా రాబోతున్న‌ట్లు స‌మాచారం.

టాపిక్