OTT Malayalam Web Series: ఓటీటీలోకి వస్తున్న మలయాళం కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే
OTT Malayalam Web Series: ఓటీటీలోకి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మలయాళం కామెడీ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ మధ్యే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. వచ్చే నెలలో స్ట్రీమింగ్ కు రానుంది.
OTT Malayalam Web Series: మలయాళం నుంచి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. ఎంతోకాలంగా ప్రొడక్షన్ లోనే ఉన్న ఈ సిరీస్ మొత్తానికి ట్రైలర్ రిలీజ్ తోపాటు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు జై మహేంద్రన్. సైజు కురుప్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ కూడా ఫన్నీగా, ఆసక్తికరంగా సాగింది.
జై మహేంద్రన్ వెబ్ సిరీస్
మలయాళం నుంచి వస్తున్న కొత్త కామెడీ వెబ్ సిరీస్ పేరు జై మహేంద్రన్. రాహుల్ రిజీ నాయర్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ ను శ్రీకాంత్ మోహన్ డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్ అక్టోబర్ 11 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్యే సదరు ఓటీటీ ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ ఓటీటీలో రాబోతున్న తొలి మలయాళం వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో లీడ్ రోల్ పోషించిన సైజు కురుప్ ను చూడొచ్చు. ఇందులో అతడు మహేంద్రన్ అనే ఓ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. మాటలతో మాయ చేసి, ప్రజలను, మీడియాను బురిడీ కొట్టించే పాత్రలో సైజు కురుప్ అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. కేరళలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను ఈ కామెడీ సిరీస్ ద్వారా చూపించబోతున్నారు.
కామెడీ పొలిటికల్ డ్రామా
జై మహేంద్రన్ వెబ్ సిరీస్ ఓ కామెడీ పొలిటికల్ డ్రామా. ఈ సిరీస్ ట్రైలర్ ను లాంచ్ చేస్తూ.. "మిమ్నల్ని నవ్విస్తూనే ఆలోచింపజేసే ఓ భిన్నమైన పొలిటికల్ డ్రామా. జై మహేంద్రన్ ను అక్టోబర్ 11 నుంచి సోనీలివ్ లో చూడండి" అని సోనీలివ్ ఓటీటీ క్యాప్షన్ ఉంచింది. ఈ సిరీస్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లోనూ అందుబాటులోకి రానుంది.
ఈ సిరీస్ లో ఓ తెలివైన రాజకీయ నాయకుడు మహేంద్రన్ జి పాత్రలో సైజు కురుప్ కనిపించబోతున్నాడు. ఈ సిరీస్ లో అతనితోపాటు సుహాసిని మణిరత్నం, మియా, సురేశ్ కృష్ణ, మాముకోయా, బాలచంద్రన్, విష్ణు గోవిందన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు.