OTT Family Drama: ఓటీటీలోకి నేరుగా వస్తున్న సరికొత్త ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott family drama the signature to stream on zee5 from october 4th latest ott movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Family Drama: ఓటీటీలోకి నేరుగా వస్తున్న సరికొత్త ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Family Drama: ఓటీటీలోకి నేరుగా వస్తున్న సరికొత్త ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Sep 24, 2024 12:39 PM IST

OTT Family Drama: ఓటీటీలోకి మరో ఫ్యామిలీ డ్రామా మూవీ నేరుగా వస్తోంది. తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 24) ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరో పది రోజుల్లో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కానుంది.

ఓటీటీలోకి నేరుగా వస్తున్న సరికొత్త ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి నేరుగా వస్తున్న సరికొత్త ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Family Drama: తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీల్లోకి వస్తున్న సినిమాల సంఖ్య ఈ మధ్య ఎక్కువవుతోంది. అలా ఇప్పుడు మరో మూవీ కూడా వస్తోంది. ఈ సినిమా పేరు ది సిగ్నేచర్. ఇదొక హిందీ మూవీ. వచ్చే వారం ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న ఈ ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ ను మంగళవారం (సెప్టెంబర్ 24) మేకర్స్ రిలీజ్ చేశారు.

ది సిగ్నేచర్ ఓటీటీ రిలీజ్ డేట్

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన మూవీ ది సిగ్నేచర్. గజేంద్ర అహిరే డైరెక్ట్ చేశాడు. అనుపమ్ ఖేర్ స్టూడియో కూడా నిర్మాతల్లో ఒకరిగా ఉంది. జీ5 ఒరిజినల్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి అదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందట అనౌన్స్ చేసిన సదరు ఓటీటీ.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసింది. జీవితంలో బాధ్యతలన్నీ మోసి చివరి దశలో వాటి నుంచి దూరంగా హాయిగా గడిపేద్దామనుకునే ఓ వృద్ధ జంట చుట్టూ తిరిగే కథే ఈ ది సిగ్నేచర్ మూవీ.

ఈ సినిమా ట్రైలర్ మనసుకు హత్తుకునేలా, గుండె చివుక్కుమనేలా సాగింది. "ఓ భర్త ఆశ మరణాన్ని జయిస్తుందా లేక ఓ సంతకం మొత్తాన్నీ మార్చేస్తుందా? ది సిగ్నేచర్ అక్టోబర్ 4న జీ5లో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ లాంచ్ చేశారు.

ది సిగ్నేచర్ ట్రైలర్ ఎలా ఉందంటే?

ది సిగ్నేచర్ మూవీ ఓ వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. జీవితం మొత్తం బాధ్యతలే మోశాం.. ఇక జీవితాన్ని ఆస్వాదిద్దాం అని ఓ భార్య తన భర్తతో చెప్పే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలువుతుంది. అందుకే సరే అని ఆ భర్త అనడంతో ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లేందుకు సిద్దమై ఎయిర్ పోర్టు వెళ్తారు. అక్కడే అనుకోకుండా ఆమె అనారోగ్యం బారిన పడటంతో కథ మొత్తం మలుపు తిరుగుతుంది.

కొన ఊపిరితో పోరాటం చేస్తున్న తన భార్యను బతికించుకోవడానికి ఆ భర్త ఎలాంటి కష్టాలు పడ్డాడో ఈ ట్రైలర్ లో చూపించారు. లక్షలు ఖర్చవడమే తప్ప దాని వల్ల ప్రయోజనం లేకపోవడంతో ఇక ఆమెకు కృత్రిమ శ్వాస ఆపేయాలని కొడుకు చెప్పినా ఆ భర్త మాత్రం ఆశ వదులుకోడు.

చివరికి తన ఇంటిని కూడా అమ్మడానికి సిద్ధమవుతాడు. అయితే దీనికి వాళ్ల కొడుకు అంగీకరించడు. నేను సంతకం పెట్టను అని తేల్చి చెబుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ భర్త ఏం చేస్తాడు? తన భార్యను కాపాడుకుంటాడా? లేదా అన్నది ది సిగ్నేచర్ మూవీలో చూడొచ్చు.

తమ పిల్లలను ప్రయోజకులను చేయడానికి తమ మొత్తం జీవితాన్ని త్యాగం చేసే తల్లిదండ్రులు.. చివరికి తమకు ఆపద వస్తే మాత్రం ఆదుకోవడానికి ఆ పిల్లలు ముందుకు రాకపోతే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఈ సినిమా ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ది సిగ్నేచర్ మూవీ అక్టోబర్ 4 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner