Oscar 2022 | అట్టహాసంగా మొదలైన ఆస్కార్ వేడుకలు... డ్యూన్ కు అవార్డుల పంట-oscar 2022 dune movie won multiple awards ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Oscar 2022 | అట్టహాసంగా మొదలైన ఆస్కార్ వేడుకలు... డ్యూన్ కు అవార్డుల పంట

Oscar 2022 | అట్టహాసంగా మొదలైన ఆస్కార్ వేడుకలు... డ్యూన్ కు అవార్డుల పంట

Nelki Naresh HT Telugu
Mar 28, 2022 06:33 AM IST

ఆస్కార్ వేడుకలో డ్యూన్ సినిమా అవార్డుల రేసులో దూసుకుపోతున్నది. ఇప్పటివరకు ప్రకటించిన పలు కేటగిరిల్లో ఈ సినిమా ఆరు అవార్డులను అందుకున్నది. బెస్ట్ సౌండ్ డిజైనింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైనింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో డ్యూన్ సినిమా అవార్డులను గెలుచుకున్నది.

<p>డ్యూన్ సినిమా</p>
డ్యూన్ సినిమా (twitter)

94వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా మొదలయ్యాయి. లాస్ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో వైభవంగా ఈ అవార్డు వేడుకలు జరుగుతున్నాయి. రెడ్ కార్పెట్ పై పలువురు హాలీవుడ్ తారలు భిన్న రంగులతో డిఫరెంట్ గా డిజైన్ చేసిన వస్త్రధారణలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ ఆస్కార్ రెడ్ కార్పెట్ పై హాలీవుడ్ నటీనటులతో పాటు ఆపిల్ సీఈఓ టీమ్ కుక్ కూడా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఈ అవార్డు వేడుకల్లో బెస్ట్ సౌండ్ డిజైనింగ్ కేటగిరి విజేతల్ని తొలుత ప్రకటించారు. ఇందులో డ్యూన్ సినిమాకు అవార్డు వరించినట్లు హోస్ట్ లు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రకటించిన కేటగిరిల్లో బెస్ట్ సౌండ్ డిజైనింగ్ తో పాటు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, ఒరిజినల్ స్కోరు విభాగాల్లో డ్యూన్ విజేతగా నిలిచి పురస్కారాలను అందుకున్నది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు సినిమాటోగ్రఫీ విభాగంలో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి.

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ గా ది లాంగ్ గుడ్ బై, యానిమేటెడ్ షార్ట్ గా ది విండ్ షీల్డ్ వైపర్ , బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీగా ది క్వీన్ ఆఫ్ బాస్కెట్ బాల్ అవార్డులను అందుకున్నాయి.

డ్యూన్ కథ ఏమిటంటే...

పదివేల ఏళ్ల తర్వాత మానవ జీవితం ఎలా ఉంటుందనే పాయింట్ తో ఫాంటసీ యాక్షన్ కథాంశంతో డ్యూన్ సినిమా తెరకెక్కింది. ఎంతో విలువైన ఖనిజ సంపద ఉన్న అర్రాకిస్ అనే గ్రహం చాలా ఏళ్లుగా హరకొన్నెన్ పాలకుల ఆధిపత్యంలో ఉంటుంది. హఠాత్తుగా వారు ఆ గ్రహాన్ని వదిలివెళ్లడంతో పాలన బాధ్యతల నిర్వహణ ను క్యాలడిన్ కు చెందిన రాజు లెట్టో అట్రాడిస్ చేపడుతాడు. అర్రాకిస్ గ్రహంపై అడుగుపెట్టిన అట్రాడిస్ పాలకులకు అక్కడ ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి?హరకొన్నెన్ రాజు వ్లాదిమిర్ వేసిన ప్లాన్ లో అట్రాడిస్ రాజు లెట్టో అట్రాడిస్, అతడి తనయుడు పాల్ అట్రాడిస్ ఎలా చిక్కుకున్నారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. గ్రాఫిక్స్ హంగులతో ఈ సినిమా కొత్త లోకంలో విహరింపచేస్తుంది. అర్రాకిస్ నగరంలో కనిపించే భవనాలు, అక్కడి పరిస్థతులనుదర్శకుడుdenis Villeneuveచూపించిన తీరు అబ్బుర పరుస్తుంది.

 

Whats_app_banner