Devara Run Time: దేవర రన్ టైమ్‌లో పదిహేను నిమిషాలు తగ్గింపు - కారణం ఇదేనా! - ఫైనల్ రన్ టైమ్ ఎంతంటే?
Devara Run Time: దేవర మూవీ రన్‌టైమ్ విషయంలో ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ రన్‌టైమ్‌ను పదిహేను నిమిషాల పాటు తగ్గించినట్లు సమాచారం. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Devara Run Time: ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. జనతా గ్యారేజ్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో జాన్వీకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
రికార్డ్ అడ్వాన్స్ బుకింగ్స్...
రిలీజ్‌కు మరో వారం రోజులు ఉండగానే ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తో దేవర రికార్డులు క్రియేట్ చేస్తోంది. శుక్రవారం నాటికి దేవర ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పదకొండు కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. రిలీజ్ వరకు రెండు మిలియన్ల అడ్వాన్స్ బుకింగ్స్ (దాదాపు పదహారు కోట్లు) టార్గెట్ రీచ్ కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఓవర్‌సీస్‌లో హయ్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన టాప్ ఫైవ్ తెలుగు మూవీస్‌లో ఒకటిగా దేవర నిలవడం ఖాయమని అంటోన్నారు.
దేవర రన్‌టైమ్...
కాగా దేవర రన్‌టైమ్ విషయంలో దర్శకుడు కొరటాల శివతో పాటు మూవీ టీమ్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రన్‌టైమ్‌ను పదిహేను నిమిషాల పాటు తగ్గించినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. తొలుత దేవర మూవీని రెండు గంటల యాభై ఏడు నిమిషాల రన్‌టైమ్‌తో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నట్లు తెలిసింది.
దళపతి విజయ్ ది గోట్‌తో పాటు ఇటీవల రిలీజైన కొన్ని స్టార్ హీరోల సినిమాలు దాదాపు మూడు గంటల రన్‌టైమ్‌తో రిలీజయ్యాయి. ఈ సినిమాల రన్‌టైమ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. ఆ విమర్శలను దృష్టిలో పెట్టుకొనే పదిహేను నిమిషాల పాటు దేవర రన్‌టైమ్‌ను మేకర్స్ తగ్గించినట్లు తెలిసింది. రెండు గంటల నలభై రెండు నిమిషాల ఫైనల్ రన్‌టైమ్‌తో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలిసింది.
లవ్ ట్రాక్ లెంగ్త్ కట్...
రన్ టైమ్ తగ్గించడం కోసం సినిమాలోని కామెడీ సీన్స్‌ను తొలగించడంతో పాటు ఎన్టీఆర్, జాన్వీకపూర్ లవ్ ట్రాక్ లెంగ్త్‌ను తగ్గించినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే ఇటీవలే రిలీజై సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన దావూదీ సాంగ్ కూడా సినిమాలో ఉండదని, ఎండ్ టైటిల్స్ సమయంలో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసేలా ఈ సాంగ్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌లు ఎవరంటే...
దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని దేవర టీమ్ గురువారం అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, త్రివిక్రమ్ గెస్ట్‌లుగా హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు దర్శకులతో పాటు ప్రశాంత్ నీల్ కూడా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు చెబుతోన్నారు.
సైఫ్ అలీఖాన్ విలన్...
దేవర మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. శ్రీకాంత్, చైత్రరాయ్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్నారు. ఫస్ట్ పార్ట్ బడ్జెట్ 300 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. దేవర పాన్ ఇండియన్ ప్రమోషన్స్‌తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.