NTR30 | సర్‌ప్రైజ్ అదిరింది.. మోషన్ పోస్టర్‌తో పవర్‌ఫుల్‌గా తారక్-ntr and koratala shiva movie ntr 30 motion poster out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr30 | సర్‌ప్రైజ్ అదిరింది.. మోషన్ పోస్టర్‌తో పవర్‌ఫుల్‌గా తారక్

NTR30 | సర్‌ప్రైజ్ అదిరింది.. మోషన్ పోస్టర్‌తో పవర్‌ఫుల్‌గా తారక్

Maragani Govardhan HT Telugu
May 19, 2022 07:41 PM IST

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న ఎన్టీఆర్30 చిత్రంపై ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పవర్ ఫుల్ డైలాగులతో తారక్ ఆకట్టుకున్నారు.

<p>NTR30</p>
NTR30 (Twitter)

యంగ్‌టైగర్ ఎన్టీఆర్.. సంచలన దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాపై తారక్ అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి. దీంతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించెందుకు చిత్రబృందం సన్నద్ధాలు చేస్తోంది. మే20 ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ఓ రోజు ముందుగానే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. NTR30(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.

వీడియో రూపంలో ఉన్న ఈ మోషన్ పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తారక్ డైలాగులు.. అభిమానులకు పూనకాలే తెప్పిస్తున్నాయి. 'అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తాను ఉండకూడదని, అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా' అంటూ పవర్‌ఫుల్ సంభాషణలతో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ వీడియో విడుదలైన కాసేపటికే ట్రెండింగ్‌గా మారింది.

మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఈ వీడియోను విడుదల చేసింది. గురువారం ఉదయం నుంచే అభిమానులకు సర్‌ప్రైజ్ ఉంటుందని ఊరించిన చిత్రబృందం ఎట్టకేలకు అద్భుతమైన పోస్టర్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో ఎన్టీఆర్ ఓ చేతిలో కత్తి, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సమద్రం మధ్యలో మునిగిపోతున్న పడపై నిలుచున్న తారక్ పవర్‌ఫుల్‌గా కనిపించారు.

ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం