Nikhil and Ram Charan Movie: రామ్ చరణ్‌తో నిఖిల్ మూవీ.. మల్టీ స్టారర్ అయితే కాదు..!
Nikhil and Ram Charan Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఓ సినిమా చేయబోతున్నారు. అయితే అది మల్టీ స్టారర్ కాదు. చరణ్ ప్రొడక్షన్లో పనిచేసేందుకు నిఖిల్ ఓకే చెప్పారు.
Nikhil and Ram Charan Movie: కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ప్రస్తుతం స్పై అనే సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై విపరీతంగా బజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ హీరో మరో స్టార్ కాంబినేషన్‌లో చేయబోతున్నారట. అవును.. మన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో నిఖిల్ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మల్టీస్టారర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే..! రామ్ చరణ్ ప్రొడక్షన్ హౌస్‌లో నిఖిల్ పనిచేయబోతున్నారు.
ఇటీవలే చరణ్.. రిచ్ కంటెంట్, యూనిక్ స్టోరీస్ చెప్పేందుకు తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి వీ మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించారు. ఈ సంస్థ మీడియం బడ్జెట్ సినిమాలను రూపొందిస్తుంది. ఇందులో భాగంగా రామ్ చరణ్-విక్రమ్ రెడ్డి కలిసి నిఖిల్‌తో ఓ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేశారు. కార్తికేయ-2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌తో ఈ సినిమా చేస్తే ప్లస్ అవుతుందని వీరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం స్పై చిత్రంతో బిజీగా ఉన్నారు నిఖిల్. విభిన్న కంటెంట్ సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ ప్రొడక్షన్స్‌లో ఓ కథకు ఓకే చెప్పారట. స్టోరీ లైన్ నచ్చడంతో చరణ్ సంస్థలో పనిచేసేందుకు పచ్చ జెండా ఊపారు. రామ్ చరణ్.. నిఖిల్‌తో కలిసి ఓ సినిమా నిర్మించడం ఇదే తొలిసారి.
నిఖిల్ నటించిన స్పై టీజర్ ఇటీవలే విడుదలైంది. సుభాష్ చంద్రబోస్ జీవిత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. నిఖిల్ సరసన ఇందులో ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. స్పై చిత్రాన్ని జూన్ 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.