AR Rahman Concert: ఏఆర్ రెహమాన్ చెన్నై మ్యూజిక్ కాన్సెర్ట్‌పై విమర్శలు - అసలైన స్కామ్ 2023 ఇదే అంటూ ట్రోల్స్
AR Rahman Concert: చెన్నైలో ఆదివారం జరిగిన ఏఆర్ రెహమాన్ కాన్సెర్ట్‌పై మ్యూజిక్ లవర్స్ దారుణంగా ఫైర్ అవుతున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొన్న కూడా కాన్సెర్ట్ లోపలికి అనుమతించలేదని ట్వీట్స్ చేస్తున్నారు.
AR Rahman Concert: ఏఆర్ రెహమాన్ కాన్సెర్ట్‌ను లైవ్‌లో చూసి ఏంజాయ్ చేయాలని అనుకున్న చాలా మంది మ్యూజికల్ లవర్స్‌కు మర్చిపోలేని చేదు జ్ఞాపకం మిగిలింది. మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం, సరైన మెయింటనెన్స్ లేని కారణంగా వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్న ఎంతో మంది కాన్సెర్ట్ చూడకుండానే వెనుదిరిగారు. ఏఆర్ ఆర్ కాన్సెప్ట్ పేరుతో చెన్నైలో ఆదివారం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సెర్ట్‌ను ఏర్పాటుచేశారు.
ఈ కాన్సెర్ట్‌పై సోషల్ మీడియా వేదికగా పలువురు మ్యూజిక్ లవర్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆర్గనైజర్స్ నిర్లక్ష్యం కారణంగా మ్యూజిక్ కాన్సెర్ట్ పూర్తిగా ఫెయిలయిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రెహమాన్‌పై విమర్శల్ని గుప్పిస్తున్నారు.
వీఐపీలకు కోసం ఒక్కో టికెట్ ను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు అమ్మిన ఈవెంట్ ఆర్గనైజర్స్...వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయలేదని, సరైన సెక్యూరిటీ కల్పించలేదని నెటిజన్ ట్వీట్ చేశారు. మ్యూజిక్ కాన్సెర్ట్ ముందు వరుసలో కూర్చున్న వారికి సైతం రెహమాన్ వాయిస్ వినిపించలేదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒరిజినల్ టికెట్స్ ఉన్నా కూడా పోలీసులు కాన్సెర్ట్ లోపలికి అనుమతించలేదని, ఈవెంట్ స్టేజ్ ఫుల్ అయిపోయిందంటూ వెనక్కి తిరిగి పంపించారని కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేశారు. ఇదే అసలైన స్కామ్ 2023 అంటూ రెహమాన్ మ్యూజికల్ కాన్సెర్ట్‌ను ఉద్దేశించిన ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
పరిధికి మంచి కావాలనే ఈవెంట్ ఆర్గనైజర్స్ టికెట్స్ అమ్మారని, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. నెటిజన్ల ట్వీట్స్‌పై ఏఆర్ రెహమాన్ రెస్పాండ్ అయ్యారు. టికెట్స్ కొని కూడా కాన్సెర్ట్ చూడలేకపోయిన వారు ఒరిజినల్ టికెట్స్ తమ టీమ్‌కు షేర్ చేయాలంటూ ట్వీట్ చేశాడు. కాన్సెర్ట్ ఆర్గనైజర్స్ నుంచి డబ్బులు వెనక్కి ఇప్పించేందుకు రెహమాన్ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
టాపిక్