Nayanthara: మూడేళ్ల‌లో తొమ్మిది ఫ్లాపులు - అయినా న‌య‌న‌తార క్రేజ్‌ త‌గ్గ‌లేదు - రెమ్యున‌రేష‌న్‌లో టాప్-nayanthara becomes number one in highest paid kollywood heroines list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara: మూడేళ్ల‌లో తొమ్మిది ఫ్లాపులు - అయినా న‌య‌న‌తార క్రేజ్‌ త‌గ్గ‌లేదు - రెమ్యున‌రేష‌న్‌లో టాప్

Nayanthara: మూడేళ్ల‌లో తొమ్మిది ఫ్లాపులు - అయినా న‌య‌న‌తార క్రేజ్‌ త‌గ్గ‌లేదు - రెమ్యున‌రేష‌న్‌లో టాప్

Nelki Naresh Kumar HT Telugu
Dec 15, 2023 10:58 AM IST

Nayanthara: గ‌త మూడేళ్ల‌లో న‌య‌న‌తార న‌టించిన ప‌ద‌కొండు సినిమాల్లో తొమ్మిది డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా కోలీవుడ్‌లో న‌య‌న‌తార నంబ‌ర్‌వ‌న్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది.

న‌య‌న‌తార
న‌య‌న‌తార

Nayanthara: కోలీవుడ్‌, టాలీవుడ్‌లో అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. న‌య‌న‌తార‌. ఈ ఏడాది జ‌వాన్‌లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తొలి అడుగులోనే హిందీలో ఇండ‌స్ట్రీ హిట్‌ను అందుకున్న సౌత్ హీరోయిన్‌గా స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. జ‌వాన్‌తోనే చాలా గ్యాప్ త‌ర్వాత హిట్ అనే మాట విన్న‌ది న‌య‌న‌తార‌.

ఈ సినిమాకు ముందు గ‌త మూడేళ్ల‌లో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో న‌య‌న‌తార ప‌ద‌కొండు సినిమాల్లో న‌టించింది. వాటిలో తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్‌గా మిగిలాయి. ఈ మూడేళ్ల‌లో న‌య‌న‌తార న‌టించిన సినిమాల్లో జ‌వాన్‌తో పాటు న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కాథు వ‌కుల రెండు కాద‌ల్ సినిమాలు మాత్ర‌మే క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లుగా నిలిచాయి.

మ‌ల‌యాళం మూవీతో...

గ‌త మూడేళ్ల‌లో త‌మిళంలో ర‌జ‌నీకాంత్ అన్నాత్తేతో పాటు నెట్రిక‌న్‌, క‌నెక్ట్, ఇర‌వైన్, కాథు వ‌కుల రెండు కాద‌ల్ సినిమాలు చేసింది న‌య‌న‌తార‌. వీటిలో కాథు వ‌కుల రెండు కాద‌ల్ సినిమా మిగిలిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి జ‌వాన్ త‌ర్వాత ఈ డిసెంబ‌ర్ 1న అన్న‌పూర్ణితో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది న‌య‌న‌తార‌. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోడంతో ఈ సినిమా కూడా న‌య‌న్ ఫ్లాపుల లిస్ట్‌లో చేరిపోయింది.

మ‌ల‌యాళంలో నిజాల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు జోడీగా గోల్డ్ అనే సినిమాలు చేసింది న‌య‌న‌తార‌. మ‌ల‌యాళంలో సినిమాలు చేసింది అన్న పేరు మిన‌హా న‌య‌న‌తార‌ కెరీర్‌కు ఈ మూవీస్‌ ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయాయి. తెలుగులో గోపీచంద్ ఆర‌డుగుల బుల్లెట్‌, చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ సినిమాల్లో న‌టించింది న‌య‌న‌తార‌. ఈ రెండు సినిమాలు కూడా న‌య‌న్‌కు నిరాశ‌నే మిగిల్చాయి.

ఆమె ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు జ‌వాన్‌తో బ్రేక్ ప‌డింది. షారుఖ్‌ఖాన్ హీరోగా ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో రిలీజైన ఈ మూవీ ప‌ద‌కొండు వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. న‌య‌న‌తార కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా జ‌వాన్ నిలిచింది.

హయ్యెస్ట్ రెమ్యునరేషన్…

మూడేళ్ల‌లో తొమ్మిది ఫ్లాప్‌లు ఎదురైన కోలీవుడ్‌లో న‌య‌న‌తార‌కు ఉన్న క్రేజ్ కొంచెం కూడా త‌గ్గ‌లేదు. వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది. ప‌రాజ‌యాల ఎఫెక్ట్ న‌య‌న‌తార కెరీర్‌పై ఏ మాత్రం లేద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఆమె నంబ‌ర్‌వ‌న్ ప్లేస్‌కు ఢోకా లేద‌ని అంటున్నారు.

కోలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్ల‌లో న‌య‌న‌తార‌నే టాప్ ప్లేస్‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక్కో సినిమాకు 12 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటోంది. ప్ర‌స్తుతం మ‌రో ఐదు సినిమాల్లో న‌య‌న‌తార న‌టిస్తోంది. టెస్ట్‌తో పాటు మంగ‌ట్టి సినిమాల షూటింగ్‌ల‌తో బిజీగా ఉంది న‌య‌న‌తార‌. త్వ‌ర‌లోనే మిగిలిన మూడు సినిమాల షూటింగ్‌ల‌ను మొద‌లుపెట్ట‌బోతుంది.