Breathe OTT Release: థియేటర్లలో జీరో కలెక్షన్స్ రాబట్టిన నందమూరి హీరో డిజాస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
Breathe OTT Release:నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన బ్రీత్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 8 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Breathe OTT Release Date: నందమూరి చైతన్య కృష్ణ(Nandamuri Chaitanya Krishna )ఎంట్రీ ఇచ్చిన బ్రీత్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో రిలీజైన బ్రీత్ మూవీ జీరో కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌తో బ్రీత్ మూవీ తెరకెక్కినట్లు సమాచారం. బుకింగ్స్ యాప్ ద్వారా ఈ సినిమా సింగిల్ టికెట్ కూడా అమ్ముడుపోలేదని సమాచారం.జీరో కలెక్షన్స్‌తో డిజాస్టర్ కా బాప్‌గా బ్రీత్ నిలిచినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
తాజాగా ఈ జీరో కలెక్టెడ్ మూవీ ఓటీటీ రిలీజ్ కాబోతోంది. మార్చి 8 నుంచి ఆహా ఓటీటీలో (Aha OTT) బ్రీత్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత బ్రీత్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బ్రీత్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా అఫీషియల్‌గా ప్రకటించింది. ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ ఇదని పేర్కొన్నది. కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
బాలకృష్ణ సోదరుడు...
బ్రీత్ సినిమాకు వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ అన్నయ్య జయకృష్ణ వారసుడిగా చైతన్య కృష్ణ బ్రీత్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొడుకును హీరోగా పరిచయం చేయడం కోసం జయకృష్ణ స్వయంగా బసవతారకమ్ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా బ్రీత్ మూవీని నిర్మించాడు.
గతంలో జగపతిబాబు హీరోగా నటించిన ధమ్ అనే సినిమాలో చైతన్యకృష్ణ కీలక పాత్ర పోషించాడు. మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాడు. హీరోగా మాత్రం బ్రీత్ అతడి ఫస్ట్ మూవీ. బ్రీత్ మూవీతోనే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాడు.
బ్రీత్ కథ ఇదే...
రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. అతడిని చంపడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యమంత్రిని ఓ సాధారణ యువకుడు ఎలా కాపాడాడు? అసలు అతడు ఎవరు? అతడికి ముఖ్యమంత్రితో ఉన్న సంబంధం ఏమిటి అన్నదే బ్రీత్ మూవీ కథ. మెడికో థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు వంశీకృష్ణ ఆకేళ్ల ఈ మూవీని తెరకెక్కించాడు. సినిమాపై బజ్ లేకపోవడం, సరైన ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో సినిమా డిజాస్టర్ అయ్యింది.
ప్రమోషన్స్ లో బాలకృష్ణ…
బ్రీత్ ప్రమోషన్స్‌లో నందమూరి బాలకృష్ణ (Balakrishna) పాల్గొన్న కూడా అతడి క్రేజ్ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. బ్రీత్ రిలీజైన టైమ్‌లోని యానిమల్, హాయ్ నాన్న భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ చిన్న సినిమాను తెలుగు ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. దర్శకుడిగా వంశీకృష్ణ ఆకేళ్ల గతంలో రక్ష, జక్కన్నతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
సినిమా ఫెయిలైన
బ్రీత్ సినిమా ఫెయిలైన ప్రమోషన్స్‌లో నందమూరి చైతన్యకృష్ణ స్పీచ్‌లు, డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతడిని ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. బ్రీత్ సినిమాలో వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందించాడు.