Jagapathi Babu: నాలుగు రోజుల్లోనే నా సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు - రుద్రంగి రిజల్ట్‌పై జగపతిబాబు కామెంట్స్
Jagapathi Babu on Rudrangi: రుద్రంగి ప్రొడ్యూసర్ ఎమ్మెల్యే అయినా సినిమా ప్రమోషన్స్ సరిగా చేయలేకపోయాడని జగపతిబాబు అన్నాడు. ఈ సినిమా రిజల్ట్‌పై జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Jagapathi Babu on Rudrangi: రుద్రంగి సినిమా రిజల్ట్‌పై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రుద్రంగిని థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే సినిమా రిజల్ట్ వేరుగా ఉండేదని అన్నాడు. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మమతామోహన్‌దాస్, విమలారామన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.

రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమా రిజల్ట్‌పై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుద్రంగి కథ నచ్చడంతో రెమ్యునరేషన్ తగ్గించుకొని ఈ సినిమా చేశానని జగపతిబాబు అన్నాడు. సినిమా ప్రొడ్యూసర్ ఎమ్మెల్యే అయినా సరిగా ప్రమోషన్ చేయలేకపోయాడని చెప్పాడు.
సినిమా బాగా రావాలనే తపన ప్రొడ్యూసర్‌లో కనిపించలేదని జగపతిబాబు పేర్కొన్నాడు. అందువల్లే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారని జగపతిబాబు తెలిపాడు. దాంతో మంచి సినిమా అనాథగా మారిపోయిందని తెలిపాడు. దాదాపు ఏడు, ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రుద్రంగి సినిమాను తెరకెక్కించారని, నాకున్న మార్కెట్‌కు ఆ రేంజ్ బడ్జెట్ వర్కవుట్ కాదని ముందే ఊహించానని జగపతిబాబు అన్నాడు.
రిలీజ్ డిలే అవుతుండటంతో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయమని ప్రొడ్యూసర్స్‌కు చెప్పానని, కానీ వినలేదని జగపతిబాబు అన్నాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. రిజల్ట్ సంగతి పక్కనపెడితే రుద్రంగి తన కెరీర్‌లో బెస్ట్ మూవీ అని జగపతిబాబు చెప్పాడు. జగపతిబాబు కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
టాపిక్