Nagarjuna in Coolie: రజనీకాంత్ కూలీలో నాగార్జున.. బర్త్‌డే రోజు ఫస్ట్ లుక్ రిలీజ్.. సైమన్‌గా అదిరిపోయిన లుక్-nagarjuna in coolie movie first look released on his birthday rajinikanth lokesh kanagaraj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna In Coolie: రజనీకాంత్ కూలీలో నాగార్జున.. బర్త్‌డే రోజు ఫస్ట్ లుక్ రిలీజ్.. సైమన్‌గా అదిరిపోయిన లుక్

Nagarjuna in Coolie: రజనీకాంత్ కూలీలో నాగార్జున.. బర్త్‌డే రోజు ఫస్ట్ లుక్ రిలీజ్.. సైమన్‌గా అదిరిపోయిన లుక్

Hari Prasad S HT Telugu
Aug 29, 2024 08:02 PM IST

Nagarjuna in Coolie: రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీలో అక్కినేని నాగార్జున ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. అతని బర్త్ డే సందర్భంగా గురువారం (ఆగస్ట్ 29) మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. దీనిని నాగ్ కూడా షేర్ చేశాడు.

రజనీకాంత్ కూలీలో నాగార్జున.. బర్త్‌డే రోజు ఫస్ట్ లుక్ రిలీజ్.. సైమన్‌గా అదిరిపోయిన లుక్
రజనీకాంత్ కూలీలో నాగార్జున.. బర్త్‌డే రోజు ఫస్ట్ లుక్ రిలీజ్.. సైమన్‌గా అదిరిపోయిన లుక్

Nagarjuna in Coolie: అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానులకు కూలీ మూవీ మేకర్స్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ఈ మూవీలో నాగార్జున.. సైమన్ అనే పాత్ర పోషిస్తున్నాడు. అతని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం (ఆగస్ట్ 29) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

కూలీలో నాగార్జున

ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న కూలీ మూవీలో అక్కినేని నాగార్జున నటిస్తున్నాడు. అతని ఫస్ట్ లుక్ ను బర్త్ డే సందర్భంగా కనగరాజ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. రజనీకాంత్, శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో సైమన్ అనే పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. "కూలీ సినిమాలో సైమన్ గా కింగ్ అక్కినేని నాగార్జున సర్ నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. టీమ్ లోకి స్వాగతం. వెరీ హ్యాపీ బర్త్ డే సర్" అని లోకేష్ కనగరాజ్ అన్నాడు.

ఫస్ట్ లుక్ షేర్ చేసిన నాగ్..

లోకేష్ కనగరాజ్ పోస్ట్ చేసిన తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున కూడా షేర్ చేశాడు. "థ్యాంక్యూ లోకీ.. ఖైదీ సినిమా నుంచే నీతో పని చేయాలని అనుకుంటున్నాను. మనం చేయబోయే ప్రయాణం గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. తలైవాతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను" అని నాగ్ అన్నాడు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగార్జున పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. తన చేతికి ఓ గోల్డెన్ కలర్ వాచీ పెట్టుకుంటూ అతడు చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. మరో చేతిలో ఓ ఎర్రటి స్కార్ఫ్ కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత నాగ్ ఈ రగ్గ్‌డ్ లుక్ కొత్తగా అనిపిస్తోంది. కూలీ మూవీలో సైమన్ అనే పాత్రలో అతడు నటిస్తున్నా.. దీని గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడించనున్నారు.

కూలీ మూవీ గురించి..

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గతంలోనే రజనీకాంత్ వీడియోతో మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీలో మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ కూడా నటించబోతున్నట్లు ఈ మధ్యే మేకర్స్ వెల్లడించారు.

అటు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర కూడా మూవీలో ఉన్నాడు. తాజాగా తెలుగు నుంచి నాగార్జునను తీసుకోవడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. వీళ్లే కాకుండా సత్యరాజ్, మహేంద్రన్ కూడా సినిమాలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక నాగార్జున విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతికి అతడు నా సామి రంగ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల కుబేర మూవీలో ధనుష్, రష్మిక మందన్నాతో కలిసి నటిస్తున్నాడు.

Whats_app_banner