Naga Chaitanya Dhoota ott release date: నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
Naga Chaitanya Dhoota ott release date: నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రైమ్ వీడియో రూపొందించిన ఈ తొలి తెలుగు వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Naga Chaitanya Dhoota ott release date: నాగ చైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ దూత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ కొత్త సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ అనౌన్స్ చేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రానుంది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం చైతన్య ముంబై వెళ్లాడు. అక్కడ ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగులో సిరీస్ ప్రమోషన్ చేపట్టాడు.
ఈ దూత వెబ్ సిరీస్ చాలా రోజుల కిందటే షూటింగ్ పూర్తి చేసుకుంది. అప్పటి నుంచీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ ద్వారానే నాగ చైతన్య ఓటీటీలో అడుగు పెట్టబోతున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న చైతన్య.. ఈ వెబ్ సిరీస్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
దూత వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో తమ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. మిస్టరీయా లేక మెసేజా? త్వరలోనే మీరు తెలుసుకుంటారు అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో దూత వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో నాగ చైతన్య ఓ గొడుగు పట్టుకొని చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.
ఈ సిరీస్ ప్రమోషన్ కోసం ముంబై వెళ్లిన నాగ చైతన్య.. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా చూడనున్నాడు. తరుణ్ భాస్కర్ కూడా కీలక పాత్ర పోషించిన ఈ దూత వెబ్ సిరీస్ ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. చాలా రోజుల కిందటే దూత సిరీస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. మనం, థ్యాంక్యూలాంటి మూవీలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ఈ సిరీస్‌ను కూడా డైరెక్ట్ చేశాడు.
ఆ మధ్య ఈ సిరీస్ బడ్జెట్ వెల్లడైంది. ఇప్పటి వరకూ తెలుగులో రూపొందిన వెబ్ సిరీస్‌లు అన్నింటికంటే ఈ సిరీస్ బడ్జెటే ఎక్కువ కావడం విశేషం. ఈ దూత వెబ్ సిరీస్ కోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ సిరీస్‌లో నటించిన నాగ చైతన్య, డైరెక్షన్ చేసిన విక్రమ్‌లు చెరో రూ.5 కోట్లు అందుకున్నారు. ఇంత బడ్జెట్‌తో రూపొందిన ఈ సిరీస్‌పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి.
అందుకు తగినట్లే ఈ సిరీస్ కూడా ఉండటంతో డైరెక్టర్ విక్రమ్‌తో మరో ప్రాజెక్ట్ కోసం కూడా ప్రైమ్ వీడియో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ దూత వెబ్ సిరీస్ ఓ హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రైమ్ వీడియో తాము తెలుగులో నిర్మించిన తొలి వెబ్ సిరీస్‌కే ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం నిజంగా విశేషమే.