Ghost OTT Release Date: శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍పై అధికారిక ప్రకటన-ghost ott release date confirmed shivarajkumar action thriller streaming date announced by zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ghost Ott Release Date: శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍పై అధికారిక ప్రకటన

Ghost OTT Release Date: శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍పై అధికారిక ప్రకటన

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 13, 2023 09:43 PM IST

Ghost OTT Release Date: ఘోస్ట్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో శివరాజ్ కుమార్ హీరోగా నటించారు.

Ghost OTT Release Date: శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Ghost OTT Release Date: శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Ghost OTT Release Date: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా మంచి విజయం సాధించింది. కన్నడలో ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అయింది. అయితే, అప్పుడు తీవ్రమైన పోటీ ఉండటంతో తెలుగు వెర్షన్‍లో ఘోస్ట్ మూవీ నవంబర్ 4న థియేటర్లలోకి వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం.. తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కాగా, తాజాగా ఘోస్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

ఘోస్ట్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 17వ తేదీన ఘోస్ట్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు జీ5 నేడు (నవంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.

యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఘోస్ట్ వచ్చింది. ఈ సినిమాకు ఎంజీ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. జయరామ్, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, అర్చనా జోయిస్, సత్యప్రకాశ్, అభిజిత్, విజయలక్ష్మి సంగ్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో హీరో శివరాజ్ కుమార్ రెండు రోల్స్ చేశారు. బిగ్‍డాడీ ముద్దన్న అనే గ్యాంగ్‍స్టర్ పాత్రలో ఆయన యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఓ జైలును గ్యాంగ్‍స్టర్ బిగ్‍డాడీ దలవలయి ముద్దన్న (శివరాజ్ కుమార్) హైజాక్ చేయడం, దొంగతనం చుట్టూ ఘోస్ట్ మూవీ సాగుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి కన్నడలో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది.

ఘోస్ట్ చిత్రాన్ని సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అరుణ్ జన్య ఈ సినిమాకు సంగీతం అందించారు. మహేంద్ర సిమ్హా సినిమాటోగ్రఫీ చేయగా.. దీపూ కుమార్ ఎడిటింగ్ చేశారు.

Whats_app_banner