Most Watched Movie in OTT: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. మీరు చూశారా?-most watched movie in ott shah rukh khans jawan makes history ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Most Watched Movie In Ott Shah Rukh Khans Jawan Makes History

Most Watched Movie in OTT: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. మీరు చూశారా?

Hari Prasad S HT Telugu
Nov 21, 2023 09:05 PM IST

Most Watched Movie in OTT: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిలిచింది. నయనతార కూడా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టడంతోపాటు ఓటీటీలోనూ దుమ్ము రేపింది.

జవాన్ మూవీలో షారుక్ ఖాన్
జవాన్ మూవీలో షారుక్ ఖాన్

Most Watched Movie in OTT: నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది మొదట్లో పఠాన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన షారుక్ ఖాన్ కు 2023 ఓ రేంజ్ లో కలిసి వస్తోంది. మొదట పఠాన్ సినిమా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేసింది. తర్వాత ఈ మధ్యే జవాన్ సినిమా రాగా.. ఆ మూవీ కూడా రూ.1000 కోట్లకుపైగానే వసూలు చేసింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఓటీటీలోనూ షారుక్ హవా కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

జవాన్ సినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ.. ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో నయనతార ఫిమేల్ లీడ్ గా కనిపించిన జవాన్ మూవీ.. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో రెండో స్థానంలో ఉంది.

సెప్టెంబర్ 7న థియేటర్లలో రిలీజైన జవాన్ సినిమా అన్ని భాషల్లోనూ మంచి హిట్ టాక్ సంపాదించింది. ఈ సినిమా షారుక్ ఖాన్ బర్త్ డే అయిన నవంబర్ 2న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. సుమారు మూడు వారాలు అవుతున్నా.. ఆ ఓటీటీ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో రెండో స్థానంలో ఉండటం నిజంగా విశేషమే. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన మూవీగా రికార్డు సొంతం చేసుకుంది.

జవాన్ మూవీకి 35 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ ఘనత సాధించిన తర్వాత ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ.. షారుక్ ఖాన్ ఓ పోస్ట్ చేశాడు. "ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన సినిమాగా జవాన్ నిలిచిందని చెప్పడానికి చాలా థ్రిల్ ఫీలవుతున్నాను.

మీరు ఈ సినిమాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా జవాన్ ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేశాం. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మరోసారి ఇండియన్ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆదరణను తెలియజేస్తోంది. జవాన్ కేవలం సినిమా కాదు. అది స్టోరీ టెల్లింగ్, ప్యాషన్, ఇండియన్ సినిమా స్పిరిట్ సెలబ్రేషన్. నెట్‌ఫ్లిక్స్ లో సినిమా సక్సెస్ చూసి చాలా గర్వపడుతున్నాను" అని షారుక్ అన్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.