Leo OTT Release: లియో ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్ - రెండు డేట్స్ ప్ర‌క‌టించిన నెట్‌ఫ్లిక్స్‌-thalapathy vijay leo to stream on netflix from november 24th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Thalapathy Vijay Leo To Stream On Netflix From November 24th

Leo OTT Release: లియో ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్ - రెండు డేట్స్ ప్ర‌క‌టించిన నెట్‌ఫ్లిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 20, 2023 10:25 AM IST

Leo OTT Release: లియో ఓటీటీ రిలీజ్ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. రెండు రిలీజ్ డేట్స్‌ను ప్ర‌క‌టించింది. ఆ డేట్స్ ఎవంటే?

లియో ఓటీటీ రిలీజ్ డేట్‌
లియో ఓటీటీ రిలీజ్ డేట్‌

Leo OTT Release: లియో ఓటీటీ రిలీజ్ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి రెండు రిలీజ్ డేట్స్ ప్ర‌క‌టించింది. ఇండియాలో లియో సినిమా న‌వంబ‌ర్ 24న రిలీజ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించింది. గ్లోబ‌ల్ వైడ్‌గా మాత్రం లియో న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు అనౌన్స్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

త‌మిళం, తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో లియో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. లియో ఓటీటీ హ‌క్కుల‌ను దాదాపు 120 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు సమాచారం. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ అరువందల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులోనూ బ్రేక్ ఈవెన్‌ను సాధించి నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీలో పార్తిబ‌న్‌, లియోదాస్‌గా విజ‌య్ యాక్టింగ్‌, ఎలివేష‌న్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

లియో సినిమాలో త్రిష హీరోయిన్‌గా న‌టించ‌గా సంజ‌య్‌ద‌త్‌, అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషించారు. మాస్ట‌ర్ త‌ర్వాత విజ‌య్‌, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూవీ ఇది కావ‌డం గ‌మ‌నార్హం.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.