Action Thriller OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-manoj bajpayee 100th film bhaiyya ji ott release date zee5 ott streaming action thriller ott bollywood ott films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Thriller Ott: ఓటీటీలోకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Action Thriller OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Bhaiyya Ji OTT Release Date: యాక్షన్ థ్రిల్లర్ సినిమా భయ్యా జీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది. మనోజ్ బాజ్‍పేయ్‍కి ఇది 100వ చిత్రంగా ఉంది.

Action Thriller OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్‍పేయ్ చాలా విభిన్నమైన పాత్రలు పోషించారు. నటుడిగా చాలాసార్లు ప్రశంసలు అందుకున్నారు. మనోజ్ బాజ్‍పేయ్ వందో సినిమాగా ‘భయ్యా జీ’ వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మే 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహించారు. రెండు నెలల తర్వాత భయ్యా జీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

భయ్యా జీ సినిమా జూలై 26వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారంగా వెల్లడించింది. “రాబిన్‍హుడ్ కాదు.. రాబిన్‍హుడ్‍కు బాప్ ఇతడు! దుమ్మురేపేందుకు భయ్యా జీ వచ్చేస్తున్నాడు. భయ్యా జీ జూలై 26న ప్రీమియర్ కానుంది” అని ఓటీటీలో పోస్ట్ చేసింది జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్.

భయ్యా జీ చిత్రానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో పెద్ద కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఓటీటీ స్పేస్‍లోనూ మనోజ్ బాజ్‍పేయ్ చాలా పాపులర్. దీంతో ఈ చిత్రం జీ5 ఓటీటీలో బాగానే పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది.

రివేంజ్‍ యాక్షన్ థ్రిల్లర్‌గా..

భయ్యా జీ సినిమా రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చింది. ఈ చిత్రంలో ఆజ్ఞాతంలో ఉండే మాజీ బడా గ్యాంగ్‍స్టర్.. తమ్ముడి హత్య తర్వాత మళ్లీ గన్ పట్టి రివేంజ్ తీర్చుకోవడం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. రామ్ చరణ్ అలియాజ్ భయ్యా జీగా ఈ చిత్రంలో మనోజ్ బాజ్‍పేయ్ నటించారు. భగీరథి భాయ్ కదమ్, జోయా హుసేన్, జతిన్ గోస్వామి, సువీందర్ విక్కీ, విపిన్ శర్మ, అభిషేక్ రంజన్, ఆచార్య అనంత్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అపూర్వ్ సింగ్ కర్కి తెరకెక్కించారు.

భయ్యా జీ మూవీని భానుశాలి స్టూడియోస్, ఎస్ఎస్ఓ ప్రొడక్షన్స్ పతాకాలపై వినోద్ భానుషాలి, కమలేశ్, మనోజ్ బాజ్‍పేయ్, శబానా రజా, షహీల్ ఓస్వాల్, సమీక్ష ఓస్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి మనోజ్ తివారి, సందీప్ చౌతాతో పాటు మరో ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు. తక్కువ బడ్జెట్‍తోనే రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో సుమారు రూ.12కోట్ల కలెక్షన్ల వరకు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది.

జీ5లో అదరగొడుతున్న కకుడా

హారర్ కామెడీ మూవీ కకుడా జీ5 ఓటీటీలోకి నేరుగా వచ్చింది. జూలై 12వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా, షాకిబ్ సలీమ్ ఈ చిత్రంలో మెయిన్ రోల్స్ చేశారు. కకుడా సినిమా జీ5 ఓటీటీలో ప్రస్తుతం మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. జీ5 ఓటీటీలో నేషనల్ వైడ్‍లో ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. ఈ మూవీకి ఆదిత్య సర్పోర్ట్‌దార్ దర్శకత్వం వహించారు. రాటోడీ అనే గ్రామంలో కకుడా అనే దెయ్యం చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. కకుడా మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా.. వ్యూస్ మాత్రం బాగానే దక్కుతున్నాయి.