Mani Ratnam About Ponniyin Selvan 2: పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్‌పై మణిరత్నం అప్డేట్.. విడుదలపై క్లారిటీ
Ponniyin Selvan Release Date: ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం విడుదల తేదీ గురించి అప్డేట్ ఇచ్చాడు. మొదటి భాగం విడుదలైన ఆరు నుంచి తొమ్మిది నెలల్లోగా విడుదల చేస్తామని ప్రకటించారు.
Mani Ratnam about Ponniyin Selvan Sequel: మణిరత్నం నుంచి సినిమా వస్తుందంటే చాలు సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. రొటీన్ సినిమాల మాదిరిగా కాకుండా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు ఈ దర్శకుడు. త్వరలో ఆయన పొన్నియిన్ సెల్వన్ మూవీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందజేయనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాంటి భారీ తారాగణం నటించింది. తమిళనాడు ఈ సినిమా గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని కోలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికే అంచనాలు పెంచేసుకున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా సీక్వెల్‌ను కూడా వీలైనంత త్వరలో విడుదల చేయనున్నట్లు మణిరత్నం స్పష్టం చేశారు.
చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మణిరత్నం.. పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. మొదటి భాగం విడుదలైన 6 నుంచి 9 నెలల లోపు రెండో భాగం విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం ప్రచార కార్యక్రమాల్లో చిత్రబృందం బిజీగా ఉంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీగా మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం. దాదాపు రూ.120 కోట్లకు ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే శాటిలైట్ రైట్లు కూడా భారీ మొత్తానికి సన్ టీవీ నెట్వర్క్ కొనుగోలు చేసిందట.
పదో శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, రెహమాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా.. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా ఐమాక్స్‌లో విడుదలవుతున్న మొదటి తమిళ సినిమా ఇదే కావడం విశేషం.
ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. సెప్టెంబరు 30 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత కథనం