Malli Pelli Amazon Prime Video: మళ్ళీ పెళ్లికి షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్ - ఓటీటీ ప్లాట్ఫామ్లో కనిపించని మూవీ
Malli Pelli Amazon Prime Video: మళ్ళీ పెళ్లి సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది. ఈ సినిమాను తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. అందుకు కారణం ఏమిటంటే...
Malli Pelli Amazon Prime Video: నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్ళీ పెళ్లి మూవీ స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది. జూన్ 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ పెళ్లి ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ మూవీని తొలగించింది.
లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లు సమాచారం. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా మళ్ళీ పెళ్లి సినిమా ఉందని, ఓటీటీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఇటీవలే కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును దృష్టిలో పెట్టుకొని సినిమాను తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ప్రైమ్ తొలగించనట్లు సమాచారం. తెలుగుతో పాటు కన్నడ స్ట్రీమింగ్‌ను కూడా ఆపేసినట్లు చెబుతోన్నారు. నరేష్, పవిత్రా లోకేష్ జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటనలతో దర్శకుడు ఎం.ఎస్. రాజు మళ్ళీ పెళ్లి సినిమాను తెరకెక్కించారు.
టీజర్స్, ట్రైలర్స్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. నరేష్, పవిత్రా లోకేష్ కోణం నుంచే జరిగిన వాస్తవాల్ని ఈ సినిమాలో చూపించారు.
అందరికి తెలిసిన కథే కావడంతో థియేటర్లలో ప్రేక్షకులు ఈ మూవీని తిరస్కరించారు. విజయకృష్ణా బ్యానర్‌పై నరేష్ స్వయంగా మళ్ళీ పెళ్లి మూవీని నిర్మించారు. ఈ సినిమాలో వనితా విజయ్‌కుమార్, శరత్‌బాబు, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు.