Mahesh Rajamouli Movie: మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ ఫైనల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే-mahesh rajamouli movie story finalised and shooting to start from next march says a report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Rajamouli Movie: మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ ఫైనల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

Mahesh Rajamouli Movie: మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ ఫైనల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

Hari Prasad S HT Telugu
Oct 10, 2023 10:25 AM IST

Mahesh Rajamouli Movie: మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ ఫైనల్ అయింది. ఇక షూటింగ్ మొదలయ్యేది కూడా అప్పుడే అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్
మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్

Mahesh Rajamouli Movie: మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నాయి. టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఇదీ ఒకటి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయని రాజమౌళి.. చాలా రోజుల కిందటే మహేష్ బాబుతో మూవీ అనౌన్స్ చేశాడు.

అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా మహేష్, రాజమౌళి సినిమాపై ఇండస్ట్రీలో ఓ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. వీళ్ల సినిమా స్టోరీ ఫైనల్ అయిపోయిందని, షూటింగ్ కూడా వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కావచ్చన్నది ఆ బజ్ సారాంశం. ఈ మధ్యే రాజమౌళి అండ్ టీమ్ మహేష్ తో చివరి స్టోరీ సిట్టింగ్ పూర్తి చేసిందని సమాచారం.

ఇక రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులను దాదాపు పూర్తి చేశాడు. లొకేషన్లు ఫైనల్ చేయడం, విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీబోర్డులు సిద్ధం చేయడంలాంటివి జక్కన్న పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ విదేశాల్లోనే జరగనుంది. దీంతో వచ్చే ఏడాది మార్చిలో విదేశాల్లో మూవీ షూటింగ్ ప్రారంభం కానుందన్న బజ్ వినిపిస్తోంది.

అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ లెవల్లో మహేష్ బాబు, రాజమౌళి సినిమా తెరకెక్కబోతోంది. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని గతంలోనే స్టోరీ అందించిన విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ సినిమా కోసమే టాలీవుడ్ ప్రిన్స్ ప్రత్యేకంగా కసరత్తులు చేస్తూ, శిక్షణ కూడా తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ నవంబర్ చివరిలోపు ముగిసే అవకాశం ఉంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ లోనే మహేష్, రాజమౌళి మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజానికి గుంటూరు కారం తర్వాత మహేష్ మరో చిన్న మూవీ చేస్తాడని, ఆ తర్వాతే రాజమౌళితో పని చేస్తాడన్న వార్తలు వచ్చినా.. తాజా బజ్‌తో అదంతా ఉత్తదే అని తేలిపోయింది.