Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో గణేష్ ఉత్సవాలు.. నిమజ్జనం చేసిన గౌతమ్, సితార.. వీడియో వైరల్-mahesh babu son gautham and daughter sitara done immersion of ganesh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో గణేష్ ఉత్సవాలు.. నిమజ్జనం చేసిన గౌతమ్, సితార.. వీడియో వైరల్

Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో గణేష్ ఉత్సవాలు.. నిమజ్జనం చేసిన గౌతమ్, సితార.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Sep 21, 2023 09:15 PM IST

Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం (సెప్టెంబర్ 21) తమ ఇంట్లోని గణపతిని నిమజ్జనం చేశారు మహేష్ తనయుడు గౌతమ్, కూతురు సితార. దీనికి సంబంధించిన వీడియోను నమ్రతా షిరోద్కర్ షేర్ చేయగా.. అది వైరల్ అయింది.

ఇంట్లో గణపతి నిమజ్జనం చేస్తున్న గౌతమ్, సితార
ఇంట్లో గణపతి నిమజ్జనం చేస్తున్న గౌతమ్, సితార

Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మహేష్ భార్య నమ్రతా షిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో మహేష్ తనయుడు గౌతమ్, కూతురు సితార కలిసి గణపతిని ఇంట్లోనే ఓ డ్రమ్ములో నిమజ్జనం చేయడం చూడొచ్చు.

వినాయక చవితి సందర్భంగా మహేష్ బాబు, నమ్రత అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. తమ ఇంట్లోని గణపతి ఫొటోను షేర్ చేశారు. ఇక తాజాగా ఆ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అయితే ఈ వీడియోలో మహేష్ బాబుకానీ, నమ్రత కానీ కనిపించలేదు. గౌతమ్, సితారలే ఇంట్లోని పనివాళ్లతో కలిసి నిమజ్జనం చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.

ఈ నిమజ్జనం ఎలా చేయాలో కూడా వాళ్లే గౌతమ్, సితారలకు చెప్పడం విశేషం. ఇంట్లోని గణపతిని గౌతమ్ ఎత్తుకొని ముందు నడవగా.. వెనుక సితార, ఇంట్లోని ఇతర పనివాళ్లు నడిచారు. ఈ వీడియోను నమ్రత షేర్ చేస్తూ.. "గణపతి బప్ప మోరయా.. వచ్చే ఏడాది మళ్లీ రా" అంటూ తన మాతృభాష మరాఠీలో రాసింది. ఈ వీడియోకు ఇన్‌స్టాలో వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్ మీడియాలో గౌతమ్ పెద్దగా కనిపించకపోయినా.. సితార మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. తాను చేసే డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ మధ్యే ఆమె ఒక యాడ్ లోనూ నటించిన విషయం తెలిసిందే. ఇక గౌతమ్ ఈ మధ్యే తన 17వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం అతడు గుంటూరు కారం మూవీలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో కలిసి ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు.