Leo Box Office Collections: లియో ఆల్‌టైమ్ అత్యధిక కలెక్షన్ల రికార్డు
Leo Box Office Collections: లియో ఆల్‌టైమ్ అత్యధిక కలెక్షన్ల రికార్డు అందుకుంది. రిలీజైన తొలి రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా తాజాగా కెనడా రీజియన్ లో ఈ రికార్డు అందుకుంది.
Leo Box Office Collections: లియో మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తొలి రోజే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ 1 రికార్డును బ్రేక్ చేయడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది.
అయితే ప్రస్తుతానికి లియో మూవీ కెనడాలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమా రికార్డు అందుకుంది. ఆ దేశంలో లియో 16 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. నిజానికి సినిమాకు కాస్త పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉండేవి. అయితే సెకండాఫ్ మొత్తం సినిమాను చెడగొట్టిందన్న విమర్శలు ఉన్నాయి.
దీనికి తానే బాధ్యత వహిస్తున్నట్లు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చెప్పాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ దారుణంగా విఫలమైంది. హిందీ బెల్ట్ లో లియో మూవీ కేవలం రూ.20 కోట్లే వసూలు చేసింది. విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మేనన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైనా.. వాటిని ఏమాత్రం అందుకోలేకపోయింది.
జైలర్ దరిదాపుల్లోకి కూడా రాదు: ట్రేడ్ అనలిస్ట్
లియో మూవీ తొలి రోజు నుంచే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్.. ఇప్పటికీ ఈ సినిమా లక్ష్యం ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. అక్టోబర్ 19న రిలీజైన లియో మూవీ.. రెండో వీకెండ్ ముగిసినా.. జైలర్ కలెక్షన్ల దరిదాపుల్లోకి రాలేదని సోమవారం (అక్టోబర్ 30) అతడు ట్వీట్ చేశాడు. తొలి రోజు రూ.115.9 కోట్ల ఓపెనింగ్ సాధించిన లియో.. తర్వాత క్రమంగా పడిపోతూ వస్తోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.342.16 కోట్లు వసూలు చేసినట్లు మనోబాల వెల్లడించాడు. 11వ రోజు లియో మూవీ రూ.11.25 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు చెప్పాడు. అదే జైలర్ మూవీ 11వ రోజు రూ.29 కోట్లు, తొలి 11 రోజులు కలిపి రూ.543 కోట్లు వసూలు చేసినట్లు తెలిపాడు. కేజీఎఫ్ 2, అవతార్ 2, ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, 2.0, జవాన్ లాంటి సినిమాల రికార్డులను లియో కేవలం ట్విటర్ లో బీట్ చేసింది తప్ప.. వసూళ్లలో అలా చేసే అవకాశమే లేదని మనోబాల తీవ్ర విమర్శలు చేశాడు.